Chiranjeevi: ఇలాంటి ప్రవర్తనను ఒప్పుకోను.. మెగాస్టార్ మాస్ వార్నింగ్

|

Mar 21, 2025 | 10:17 AM

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ 156వ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమాకు విశ్వంభర అనే ఆసక్తికర టైటిల్ ను ఖరారు చేశారు. ఈ మూవీ సోషియో-ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ సినిమా. ఈ చిత్రానికి “బింబిసార” ఫేమ్ మల్లిడి వశిష్ట దర్శకత్వం వహిస్తున్నారు.

Chiranjeevi: ఇలాంటి ప్రవర్తనను ఒప్పుకోను.. మెగాస్టార్ మాస్ వార్నింగ్
Chiranjeevi
Follow us on

ఇక మెగాస్టార్‌ చిరంజీవిని హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌- యూకే పార్లమెంట్‌లో ఘనంగా సత్కరించారు. లైఫ్‌ టైమ్ అచీవ్‌మెంట్‌ పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేశారు. ఈ ఘనత అందుకున్న తొలి భారతీయనటుడిగా నిలిచారు. ఈ ఆనందం గురించి చెప్పేందుకు మాటలు సరిపోవంటూ తన ప్రయాణంలో భాగమైన కుటుంబ సభ్యులు అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. బ్రిడ్జ్‌ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం అందుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అయితే విదేశాల్లో టికెట్ల దందాకు తెరలేపిన కొందరి అత్యుత్సాహం చూసి చిరంజీవి ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పనులు చేయొద్దంటూ హెచ్చరించారు. ఇన్నాళ్లూ యునైటెడ్‌ స్టేట్స్‌లో కనిపించిన ఈ సంస్కృతి ఇప్పుడు లండన్‌కూ పాకింది. అభిమానాన్ని క్యాష్‌ చేసుకుంటున్న కొందరిపై విమర్శలు వస్తున్నాయి. ఒక్కో టికెట్‌పై దాదాపు 2500 రూపాయలు వసూలు చేశారు నిర్వాహకులు. అయితే ఈ ఈవెంట్‌కు టికెట్స్‌ కొన్న వారి డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని చిరంజీవి ట్వీట్‌ చేయడంతో వారు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

మెగా ఉత్సవం పేరిట లండన్‌లో ఫ్యాన్స్‌ మీట్‌ ఏర్పాటు చేశారు.  ఈవెంట్‌కు 22 పౌండ్ల టికెట్‌ ధరను నిర్ణయించారు నిర్వాహకులు. టికెట్లు కొనుక్కోవాలంటూ నిర్వాహకుల ప్రకటనలు చేశారు. ఈవెంట్‌కు డబ్బు వసూలుపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి. ట్విట్టర్ లో చిరంజీవి ఫైర్ అయ్యారు. ఇలాంటి ప్రవర్తనను ఒప్పుకోను అంటూ చిరు ట్వీట్‌ చేశారు. – డబ్బులు వెంటనే తిరిగి ఇచ్చేయాలని Xలో పోస్ట్‌ చేశారు. ప్రేక్షకుల అభిమానం వెలకట్టలేనిదని చిరంజీవి అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..