Meghana Raj: రెండో పెళ్లిపై స్పందించిన చిరంజీవి సర్జా సతీమణి.. రేపు ఏం జరుగుతుందో ఆలోచించడం లేదంటూ ..

Chiranjeevi Sarja: కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంతో మానసికంగా బాగా కుంగిపోయింది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌ (Meghana Raj). ఓ సినిమా షూటింగ్‌లో మొదటిసారి కలుకున్న వీరిద్దరు ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు.

Meghana Raj: రెండో పెళ్లిపై స్పందించిన చిరంజీవి సర్జా సతీమణి.. రేపు ఏం జరుగుతుందో ఆలోచించడం లేదంటూ ..
Meghana Raj

Edited By:

Updated on: Aug 25, 2022 | 7:05 AM

Chiranjeevi Sarja: కన్నడ స్టార్‌ హీరో చిరంజీవి సర్జా హఠాన్మరణంతో మానసికంగా బాగా కుంగిపోయింది ఆయన సతీమణి, నటి మేఘనా రాజ్‌ (Meghana Raj). ఓ సినిమా షూటింగ్‌లో మొదటిసారి కలుకున్న వీరిద్దరు ఆ తర్వాత పదేళ్ల పాటు ప్రేమలో మునిగితేలారు. పెద్దల ఆశీర్వాదంతో 2018 మే 2న పెళ్లిపీటలెక్కారు. వీరి ప్రేమబంధానికి ప్రతీకగా ఓ పండంటి బిడ్డను తమ జీవితంలోకి ఆహ్వానించేందుకు కూడా సిద్ధమయ్యారు. అయితే వీరి పండంటి కాపురాన్ని చూసి కాలానికి కన్ను కుట్టిందేమో.. మేఘనా గర్భం దాల్చిన కొన్ని నెలలకే చిరంజీవి సర్జా 2020 జూన్‌ 7న గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. దీంతో భర్త జ్ఞాపకాల్లోనే బతుకుతూ కొన్ని రోజులు ఇంటికే పరిమితమైంది మేఘన. అయితే అదే ఏడాది రాయన్‌రాజ్‌ సర్జా పుట్టడంతో మళ్లీ జీవితంపై ఆశలు పెంచుకుంది. తన భర్తకు ప్రతిరూపమైన కుమారుడి ఆలనాపాలనా చూసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. ఇదిలా ఉంటే మేఘన రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ గత కొద్దికాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ వదంతులపై స్పందించిన పలు ఆసక్తికర విషయాలు వెల్లడించింది.

‘కొందరు నన్ను మళ్లీ పెళ్లి చేసుకోమంటున్నారు. మరికొందరేమో నా కుమారుడిని బాగా చూసుకుంటూ అతడితోనే ఉండమని సలహాలు ఇస్తున్నారు. మరి నేను ఎవరి మాట వినాలో అర్థం కావడం లేదు. నా భర్త చిరంజీవి ఎప్పుడూ ఒక మాట అంటుండేవారు..’ మన గురించి ఈ ప్రపంచం ఏమనుకుంటుందనేది ఎప్పుడూ పట్టించుకోకు. నీ మనసుకు ఏదనిపిస్తే అదే చేయమని చెప్పేవాడు. అయితే మళ్లీ పెళ్లి గురించి నాకు నేను ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు. రేపు ఏం జరుగుతుంది? అని నేనెప్పుడూ ఆలోచించలేదు’ అని చెప్పుకొచ్చింది మేఘన. కాగా అల్లరి నరేష్‌ హీరోగా నటించిన బెండు అప్పారావ్‌ సినిమాతోనే వెండితెరకు పరిచయమైంది మేఘన. ఆతర్వాత కన్నడ ఇండస్ట్రీలో స్టార్‌ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాక సినిమాలు తగ్గించేసిన ఆమె త్వరలో బుద్ధివంత 2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే ఓ డ్యాన్స్‌ రియాలిటీ షోకు జడ్జిగానూ వ్యవహరిస్తోందీ అందాల తార.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..