Megastar Chiranjeevi : వెంకీ నీకిది పర్ఫెక్ట్ సినిమా.. నారప్ప పై మెగాస్టార్ ప్రశంసలు

|

Jul 24, 2021 | 5:53 PM

విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ్ లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్ గా నారప్ప

Megastar Chiranjeevi : వెంకీ నీకిది పర్ఫెక్ట్ సినిమా.. నారప్ప పై మెగాస్టార్ ప్రశంసలు
Narappa
Follow us on

Narappa: విక్టరీ వెంకటేష్ నటించిన నారప్ప ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. తమిళ్‌‌‌లో సూపర్ హిట్ అయిన అసురన్ సినిమా రీమేక్‌‌‌గా నారప్ప తెరకెక్కింది. ధనుష్ హీరోగా నటించిన ఈ సినిమా అక్కడ సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక తెలుగులో వెంకటేష్ ఈ సినిమాకు పూర్తి న్యాయం చేశారనే చెప్పాలి. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన నారప్ప సినిమాను సురేష్ బాబు నిర్మించారు. ఈ రీమేక్‌‌లో తనదైన సహజ నటనతో వెంకటేష్ ధనుష్‌‌ను మరిపించారు. ఇక ఈ సినిమా పై సర్వత్రా ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి కూడా వెంకటేష్ పై పొగడ్తల వర్షం కురిపించారు. ఈమేరకు ఆయన ఓ ఆడియోను షేర్ చేశారు.

వెంకటేష్‌‌‌కు చిరు అభినందనలు తెలుపుతూ… వెంకీ నటన అద్భుతమంటూ కితాబిచ్చారు మెగాస్టార్. సినిమా చూస్తున్నంతసేపు వెంకటేష్ కనిపించలేదు నరప్పే కనిపించడు అంటూ ప్రశంసించారు. వెంకీ.. నీలో ఉండే నటుడు ఎప్పుడు ఒక తపనతో.. తాపత్రయంతో ఉంటాడు. అలాంటి నీకు ఈ సినిమా మంచి ఉదాహరణ. ఈ సినిమా నీకు మంచి పేరుతో పాటు నీ కెరిరీలో గర్వంగా చెప్పుకునే సినిమా అవుతోంది అంటూ ప్రశంసించారు మెగాస్టార్. ఇక కరోనా కారణంగా నారప్ప సినిమా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా మంచి టాక్‌‌‌తో దూసుకుపోతుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Yandamuri Veerendranath : మరో సినిమా మొదలుపెట్టిన యండమూరి వీరేంద్రనాధ్.. ఈ సారి సునీల్ హీరోగా..

Brahmaji: ట్విట్టర్‌లో బ్రహ్మాజీని ఉతికి ఆరేస్తున్న రానా, నాగశౌర్య.. మాములు ఫన్ కాదు…

Bichagadu 2 : తొలిసారి మెగాఫోన్ పట్టనున్న విజయ్ ఆంటోని.. ఆసక్తికరంగా బిచ్చగాడు2 పోస్టర్..