“హృదయం బద్దలయ్యింది”.. పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడితో ఒక్కసారిగా భారత్ ఉలిక్కిపడింది. ఈ ఘటనలో ఉగ్రవాదులు పేట్రేగిపోయారు. అనంత్‌నాగ్‌ జిల్లా పహల్గాంలో పర్యాటకులే లక్ష్యంగా దాడులకు తెగబడ్డారు. మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరన్‌ ప్రాంతంలో విహారానికి వచ్చినవారిపై పాశవిక దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో28మంది పర్యటకులు ప్రాణాలు కోల్పోగా.. మరో 20 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

హృదయం బద్దలయ్యింది.. పహల్గామ్‌లో ఘటన పై చిరంజీవి, కమల్, మోహన్ లాల్
Toollywood

Updated on: Apr 23, 2025 | 11:14 AM

జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై నిన్న( మంగళవారం) జరిగిన ఉగ్రవాద దాడితో దేశం మొత్తం ఉల్లిక్కి పడింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఉగ్రవాదంపై పోరాటంలో భారత్‌కి తమ మద్దతును తెలియజేస్తున్నాయి. పుల్వామా దాడి తర్వాత జమ్ముకశ్మీర్‌ లోయలో జరిగిన మరో అతి పెద్ద దాడి ఇది. జమ్మూ కాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని పహల్గామ్‌లో మంగళవారం జరిగిన ఉగ్రవాద దాడిలో ఇద్దరు విదేశీయులు సహా 28 మంది పర్యాటకులు మరణించారు. అనేక మంది గాయపడ్డారు. 2019లో పుల్వామా దాడి తర్వాత జమ్మూ లోయలో జరిగిన అత్యంత దారుణమైన దాడి ఇది. దాడిని నిరసిస్తూ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (PCC)తో సహా వివిధ పార్టీలు బుధవారం బంద్, నిరసనకు పిలుపునిచ్చాయి.దీంతో జమ్మూ అంతటా భద్రతను కట్టుదిట్టం చేశారు.

పహల్గామ్‌ దాడిని ఖండిస్తూ సామాన్యుల దగ్గర నుంచి రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఉగ్రవాద దాడిలో మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నారు. ఈ ఘనత కలిచివేసిందని, గుండె బరువెక్కిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్ స్టార్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి వారు దీని పై రియాక్ట్ అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ఘటన పై సంతాపం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

అలాగే మళయాల స్టార్ హీరో మోహన్ లాల్ కూడా ఈ ఘటనను ఖండించారు. ఎంతో బాధగా ఉంది.. చనిపోయిన కుటుంబాలకు సానుభూతి తెలుపుతున్నా అని ట్వీట్ చేశారు.అలాగే యూనివర్సల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్, సంజయ్ దత్, సోనూ సూద్ సోషల్ మీడియాలో స్పందించారు.

చిరంజీవి ఎక్స్ పోస్ట్..

మోహన్ లాల్ ఎక్స్ పోస్ట్..

అక్షయ్ కుమార్ ఎక్స్ పోస్ట్..

కమల్ హాసన్ ఎక్స్ పోస్ట్..

సంజయ్ దత్ ఎక్స్ పోస్ట్ ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి