మెగాస్టార్ చిరంజీవి పై ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల్లో ఎంత వివాదాస్పదమయ్యాయో తెలిసిన విషయమే. అలయ్ బలయ్ కార్యక్రమంలో అతిథులుగా గరికపాటి, చిరు పాల్గొనగా..అక్కడున్న మహిళలు చిరంజీవితో ఫోటోస్ దిగేందుకు ఆసక్తి చూపించారు. దీంతో ఫోటో సెషన్ ఆపేసి వచ్చి కూర్చోవాలి లేకుంటే నేను వెళ్లిపోతా అంటూ హెచ్చరించారు గరికపాటి. దీంతో చిరు సైలెంట్ గా వెళ్లి ఆయన పక్కనే కూర్చుని ప్రవచనాలు విన్నారు. అయితే చిరు పై గరికపాటి చేసిన కామెంట్స్ తో మెగా అభిమానులు సీరియస్ అయ్యారు. సోషల్ మీడియాలో గరికపాటిపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమయ్యింది. అభిమానులే కాకుండా.. సినీ ప్రముఖులు సైతం గరికపాటి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ విషయం ఇప్పుడిప్పుడే అంతా మర్చిపోయారు. ఈ క్రమంలో తాజాగా మరోసారి గరికపాటి అంశం తెరపైకి వచ్చింది. ఏకంగా చిరునే పరొక్షంగా సెటైర్ వేయడంతో మరోసారి గరికపాటి విషయం నెట్టింట వైరలవుతుంది.
ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ ప్రభు రచించిన శూన్యం నుంచి శిఖరాగ్రాలకు పుస్తకావిష్కరణ కార్యక్రమంలో చిరు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అయితే ఈ కార్యక్రమంలో చిరు మాట్లాడిన అనంతరం ఆయనతో ఫోటోస్ దిగడానికి అక్కడున్న కొంతమంది మహిళలు స్టేజ్ పైకి చేరుకున్నారు. చిరంజీవికి పుష్పగుచ్చం అందజేసి.. అనంతం ఆయనతో ఫోటో దిగేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే చిరు మాట్లాడుతూ.. ఇక్కడ వారు లేరు కదా అంటూ వేలు పైకి చూపిస్తూ పరొక్షంగా గరికపాటిని గుర్తుచేసుకున్నారు. దీంతో అక్కడున్నవారు నవ్వేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది.
ప్రస్తుతం చిరు భోళా శంకర్, వాల్తేరు వీరయ్య చిత్రాల్లో నటిస్తున్నారు. ఇటీవల వాల్తేరు వీరయ్య సినిమా నుంచి విడుదలైన టైటిల్ మోషన్ వీడియోకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తుండగా.. మాస్ మాహారాజా అతిథి పాత్రలో కనిపించనున్నారు.
Megastar #Chiranjeevi Recent Video
BOSS @KChiruTweets Super Punch
Ekkada Vaaru leru kada ?#MegastarChiranjeevi #WaltairVeerayya pic.twitter.com/xUuf4YDHDt— Chiranjeevi Army (@chiranjeeviarmy) October 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.