Hari Hara Veera Mallu: సిల్వర్ స్క్రీన్‌పై కల్యాణ్‌ బాబు ఫైర్‌.. హరి హర వీరమల్లు ట్రైలర్‌పై చిరు, రామ్ చరణ్

ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు ట్రైలర్ కు ఊహించని రెస్పాన్స్ వస్తోంది. ఇప్పటికే యూట్యూబ్ లో ఈ ట్రైలర్ రికార్డులు బద్దలు కొడుతోంది. తాజాగా వీరమల్లు ట్రైలర్ పై మెగాస్టార్, గ్లోబల్ స్టార్ స్పందించారు.

Hari Hara Veera Mallu: సిల్వర్ స్క్రీన్‌పై కల్యాణ్‌ బాబు ఫైర్‌.. హరి హర వీరమల్లు ట్రైలర్‌పై చిరు, రామ్ చరణ్
Pawan Kalyan Hari Hara Veera Mallu Trailer

Updated on: Jul 03, 2025 | 8:32 PM

సుమారు రెండేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించనున్నారు పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హరి హర వీరమల్లు సినిమాతో ఈ రెండేళ్ల గ్యాప్‌ కు సరిపడా ఎంటర్ టైన్మెంట్ అందించేందుకు రెడీ అయ్యారు. ఇప్పటికే పలు సార్లు వాయిదా పడిన ఈ పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ జులై 24న రిలీజ్ కానుంది. పవన్ నటిస్తోన్న మొదటి పాన్ ఇండియా మూవీ ఇదే కావడంతో అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. ఇప్పుడు వీటిని హరి హర వీరమల్లు ట్రైలర్ రెట్టింపు చేసింది. గురువారం (జులై 3) విడుదలైన పవన్ సినిమా ట్రైలర్ కు అభిమానుల నుంచి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. యోధుడి పాత్రలో పవన్ ను చూసి మెగా అభిమానులు తెగ సంబరపడిపోతున్నారు. ఇప్పటికే ట్రైలర్ ధాటికి సోషల్ మీడియా షేక్ అవుతోంది. యూట్యూబ్ లో రికార్డులు బద్దలు అవుతున్నాయి. తాజాగా ఈ పవర్ ప్యాక్డ్ ట్రైలర్ పై మెగాస్టార్ చిరంజీవి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ స్పందించారు.

‘హరి హర వీరమల్లు’ ట్రైలర్‌ ఎలక్ట్రిఫయింగ్ గా ఉంది. దాదాపు రెండేళ్ల తర్వాత కల్యాణ్‌బాబు నుంచి వస్తున్న ఈ మూవీకి కచ్చితంగా థియేటర్లు దద్దరిల్లిపోతాయి. టీమ్ మొత్తానికి ఆల్‌ ది బెస్ట్‌’ అని చిరంజీవి ట్వీట్ చేశారు. ఆ వెంటనే రామ్ చరణ్ కూడా బాబాయి సినిమా ట్రైలర్ పై స్పందించాడు. హరి హర వీరమల్లు ట్రైలర్ నిజంగా సినిమా గొప్పతనాన్ని చాటి చెబుతోంది. బిగ్ స్క్రీన్ పై పవన్ కల్యాణ్ గారిని చూడటం మనందరికీ ఓ ట్రీట్. మూవీ బ్లాక్ బస్టర్ సక్సెస్ కోసం టీమ్ మొత్తానికి ఆల్ ద బెస్ట్’ అని చరణ్ ట్వీట్ చేశాడు. వీటిపై వీరమల్లు టీమ్ కూడా స్పందించింది. ట్రైలర్‌ను ప్రశంసిస్తూ పోస్ట్‌పెట్టిన చిరు, రామ్‌చరణ్‌లకు చిత్ర బృందం థ్యాంక్స్‌ చెప్పింది. ‘మెగా విషెస్‌’కు ధన్యవాదాలు తెలిపింది.

చిరంజీవి ట్వీట్..

రామ్ చరణ్ రియాక్షన్..

 

హరి హర వీరమల్లు ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..