నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన లేటెస్ట్ మూవీ డాకూ మహారాజ్ మూవీ మరికొద్దిరోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. భగవంత్ కేసరి సినిమా విజయం తర్వాత బాలకృష్ణ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు బాబీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాను జనవరి 12న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాను దర్శకుడు బాబీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్ సినిమా పై అంచనాలను భారీగా పెంచేశాయి. దాంతో ఈ సినిమా భారీ విజయం అందుకోవడం ఖాయం అంటున్నారు ఫ్యాన్స్.
డాకూ మహారాజ్ సినిమాలో ముగ్గురు హీరోయిన్స్ నటిస్తున్నారు. ప్రగ్యాజైశ్వాల్, ఊర్వశి రౌతేలా, శ్రద్దా శ్రీనాథ్ బాలయ్య సరసన నటించనున్నారు. డాకూ మహారాజ్ సినిమాలో యాక్షన్ తో పాటు ఎమోషనల్ సీన్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయనని తెలుస్తుంది. ట్రైలర్ లో బాలయ్య ఓ చిన్నారితో ఆడిపాడటం చూపించారు. ఆ పాప ఎవరు.? ఆమెకు బాలయ్యకు ఉన్న సంబంధం ఏంటి.? అని ప్రేక్షకులు ఆలోచనలో పడ్డారు.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా కు సంబందించిన ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. డాకూ మహారాజ్ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ పేరు వేదా అగర్వాల్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత బాలకృష్ణను విడిచి వెళ్లలేక ఆ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. దాంతో బాలయ్య ఆ పాపను దగ్గరకు తీసుకొని ఓదార్చారు. ఇందుకు సంబందించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. బాలకృష్ణ కోపధారి మనిషి అని కొందరు అనుకుంటున్నారు. కానీ బాలయ్య మనసు బంగారం.. అన్ స్టాపబుల్ లో బాలయ్య తనలో ఉన్న చిలిపితనాన్ని , తోటి నటీనటులతో ఆయన ఎలా ఉంటారో బయటపెట్టింది. తాజాగా ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో పిల్లలతో ఆయన బాండింగ్ ఎలా ఉంటుందో చూపిస్తుంది. ఆ చిన్నారి కన్నీళ్లు చూసిన బాలకృష్ణ కూడా ఎమోషనల్ అయ్యారు. ఈ వీడియో పై నెటిజన్స్ మా బాలయ్య బంగారం అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి