
తెలుగులో మోస్ట్ అవైటెడ్ చిత్రాల్లో పెద్ది ఒకటి. గేమ్ ఛేంజర్ సినిమా తర్వాత రామ్ చరణ్ నటిస్తోన్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. ఇందులో కన్నడ హీరో శివరాజ్ కుమార్ కీలకపాత్రలో నటిస్తున్నారు. రూరల్ బ్యాగ్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆస్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన సాంగ్స్, టీజర్ ఆకట్టుకుంటున్నాయి. పాన్ ఇండియా లెవల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి 27న విడుదల చేయనున్నారు. ఇప్పటివరకు విడుదలైన అన్ని అప్డేట్స్ ఆకట్టుకుంటుండగా.. తాజాగా ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు మేకర్స్.
ఈసినిమా నుంచి ఫస్ట్ లిరికల్ చికిరి.. చికిరి పాటను విడుదల చేశారు మేకర్స్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందించిన ఈ సాంగ్ ఇప్పుడు అందరిని ఆకట్టుకుంటుంది. రెహమాన్ మాస్ మ్యూజిక్, రామ్ చరణ్ మాస్ స్టెప్పులు అదిరిపోయాయి. ఇక జాన్వీ లుక్స్ నెక్ట్స్ లెవల్లో ఉన్నాయి. ప్రస్తుతం ఈ సాంగ్ అందరిని మెస్మరైజ్ చేస్తుంది. చికిరి చికిరి అంటూ సాగే పాటకు ఊర మాస్ లుక్ లో వెస్ట్రన్ స్టెప్పులతో అదరగొట్టారు చరణ్. చిరుత తర్వాత ఆ రేంజ్ ఎనర్జీ అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
పెద్ది సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. స్పోర్ట్స్ బ్యాగ్రౌండ్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో చరణ్ పక్కా ఊర మాస్ అవతారంలో కనిపించనున్నారు. దేవర తర్వాత జాన్వీ నటిస్తోన్న రెండో సినిమా ఇది. ఇందులోనూ మరోసారి పల్లెటూరి అమ్మాయి అచ్చియమ్మ పాత్రలో కనిపించనుంది జాన్వీ.
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..