కోలీవుడ్ హీరో శింబుకు మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. హీరోగానే కాకుండా.. గాయకుడిగా, దర్శకుడిగా ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాడు. శింబుకు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. బాలనటుడిగా సినీప్రయాణం స్టార్ట్ చేసిన శింబు హీరోగా మన్మధన్, విన్నైతాండి వరువాయా వంటి చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశారు. కొన్నాళ్ల క్రితం ఎలాంటి హిట్ అందుకోకుండా సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. కానీ కాన్ఫెరెన్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలో ‘కరోనా కుమార్’ సినిమాకు కమిట్ అయ్యి వివాదంలో చిక్కుకున్నాడు.
వేల్స్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ నిర్మాణ సంస్థ కరోనా కుమార్ సినిమాను తెరకెక్కించాలనుకుంది. ఇందులో హీరోగా నటించేందుకు శింబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇందుకుగానూ రూ.5 కోట్ల 50 లక్షలు పారితోషికం తీసుకోవాలనుకున్నారు. 2021లో 4 కోట్ల 50 లక్షల రూపాయలు అడ్వాన్స్‌గా శింబుకి అందించారు. కానీ నిర్మాణ సంస్థ మాత్రం శింబు షూటింగ్‌కి రాలేదని ఆరోపించింది. కరోనా కుమార్ చిత్రాన్ని పూర్తి చేయకుండా ఇతర చిత్రాలలో నటించకుండా శింబును నిషేధించాలని కోరుతూ నిర్మాణ సంస్థ తరపున కేసు దాఖలు చేసింది. ఈ కేసుపై విచారణ జరిపిన హైకోర్టు శింబు కోటి రూపాయలు పూచీకత్తు చెల్లించాలని ఆదేశించింది.
అలాగే, నటుడు శింబు, వేల్స్ ఫిల్మ్స్ మధ్య వివాదాన్ని పరిష్కరించేందుకు హైకోర్టు రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి కన్నన్‌ను మధ్యవర్తిగా నియమించింది. నటుడు శింబు తరఫు న్యాయవాది మాట్లాడుతూ.. మధ్యవర్తి ముందు ఇరువర్గాలు కేసును ఉపసంహరించుకున్నాయని చెప్పారు.
దీంతో కోర్టులో డిపాజిట్ చేసిన కోటి 4 లక్షల 98 వేల రూపాయలను వడ్డీతో సహా తిరిగి ఇచ్చేలా ఆదేశించాలని శింబు అభ్యర్థించాడు. దీనిని అంగీకరించిన న్యాయమూర్తి.. శింబు చెల్లించిన డిపాజిట్ మొత్తాన్ని వడ్డీతో సహా వాపసు చేయాలని హైకోర్టు చీఫ్ రిజిస్ట్రార్‌ను ఆదేశించారు.
ఇది చదవండి : Bigg Boss 8 Telugu: ముగిసిన ఓటింగ్.. బిగ్‌బాస్ విన్నర్ అతడేనా.. ఊహించని రిజల్ట్స్..
Tollywood: ఏందీ గురూ.. ఈ హీరోయిన్ ఇట్టా మారిపోయింది.. అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ క్వీన్‌గా..
Tollywood: ప్రియుడితో పెళ్లి.. ఐదు నెలలకే ప్రెగ్నెన్సీ.. ఎట్టకేలకు క్లారిటీ ఇచ్చిన హీరోయిన్..
Tollywood: ఈ అమ్మాయి గాత్రానికీ ఫిదా అవ్వాల్సిందే.. హీరోయిన్స్‌ను మించిన అందం.. ఎవరంటే..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.