ఓటీటీల్లో క్రేజీ సినిమాలు అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాలు ఓటీటీల్లో ఆకట్టుకుంటున్నాయి. అలాగే కొన్ని సినిమాలు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీల్లో ఆకట్టుకుంటున్న సినిమాల్లో థిల్లర్, హారర్, రొమాంటిక్ జోనర్స్ ఎక్కువగా ఉంటాయి. ఇక థ్రిల్లర్ సినిమాలకు ప్రేక్షుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆడియన్స్ ఎక్కువగా సస్పెన్స్ థ్రిల్లర్స్, క్రైమ్ మిస్టరీలు చూడటానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. ఇక ఇప్పుడు అలాంటి సినిమానే ఓటీటీని ఊపేస్తోంది. ఈ సినిమా చూడాలంటే నిజంగా దైర్యం ఉండాలి. ఇలాంటి సినిమాను మీరు ఎక్కడా చూసి ఉండరు. ఈ సినిమాలో హీరో ఏకంగా మనిషి మాంసాన్ని తింటూ ఉంటాడు.
చాలా భయంకరంగా ఉంటుంది ఈ సినిమా.. ఈ సినిమాలో హీరో మనిషి మాంసానికి రుచి మరుగుతాడు.. యదార్ధ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో ఓ వ్యక్తి చిన్న వయసులోనే ఉన్మాదిగా మారుతాడు. పదేళ్ల వయసులో జరిగిన ఓ అవమానకరమైన సంఘటనతో అతను ఉన్మాదిగా మారిపోతాడు. చిన్న వయసులోనే తన మేనమానాను కిరాతకంగా చంపి అతని మాంసాన్ని తింటాడు. మిగిలిన శరీరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి కుక్కలకు వేస్తాడు.
అప్పటి నుంచి అతను మనిషి మాంసానికి రుచి మరుగుతాడు.. ఓ స్లమ్ ఏరియాలో ఉంటూ చిన్నపిల్లలను కిడ్నప్ చేసి చంపుతుంటాడు.. పిల్లలను చంపి ఆ మాంసాన్ని తింటుంటాడు. అలాగే మిగిలిన అవయవాలను అమ్ముతూ ఉంటాడు. అతను చివరకు దొరికాడా.? అసలు అతను ఎందుకు అలా మారాడు అన్నది సినిమాలో చూడాల్సిందే. థియేటర్లో రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా ఓటీటీలో ఈ సినిమాను రిలీజ్ చేశారు. ఈ సినిమా పేరు సెక్టార్ 36 ఈ సినిమాలో ప్రధాన పాత్రలో విక్రాంత్ మెస్సి నటించాడు. అంతకు ముందు అతను నటించిన 12th ఫెయిల్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక సెక్టార్ 36 సినిమా ఇప్పుడు ఓటీటీలో అందుబాటులో ఉంది. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా చూడొచ్చు. ఈ సినిమాలో భయంకరమైన సన్నివేశాలు ఎక్కువే ఉన్నాయి. కాబట్టి దైర్యం ఉంటేనే ఈ సినిమా చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.