హలో గయ్స్.. మళ్లీ మరో హారర్ చిత్రంతో మీ ముందుకు వచ్చేశాం. ఓటీటీలు వచ్చాక సినిమాలకంటూ కొదవ లేకుండా పోయింది. అదీ ఏ ఓటీటీలోకి వెళ్లినా.. లెక్కలేనన్ని హారర్ సినిమాలు ఉన్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు చెప్పబోయే హారర్ సినిమాలో లెక్కలేనన్ని హారర్ సీన్స్ మాత్రమే కాదు బోల్డ్ సీన్స్ కూడా ఉన్న భయంకరమైన మూవీ. ఈ రెండు జోనర్లకు ఫ్యాన్ బేస్ విడివిడిగా ఉంటుంది. కానీ హారర్ సీన్స్.. అలాగే బోల్డ్ సీన్స్ ఉన్న ఈ చిత్రం.. అదిరిపోయే ట్విస్టులతో మిమ్మల్ని మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తుంది. మరి ఈ హారర్ చిత్రాన్ని ఏ ఓటీటీలో చూడొచ్చునంటే.? ఆ విషయాలు ఇప్పుడు తెలుసుకుందామా..
కథ విషయానికొస్తే.. అడవిలో ఒంటరిగా నివాసముంటోంది హీరోయిన్. ఆమె ఇంటి చుట్టుప్రక్కల ఓ ముసలాయన తప్ప ఇంకెవ్వరూ ఉండరు. ఇక ఈ హీరోయిన్‌కు వరుసగా పీడకలలు వెంటాడుతుంటాయి. చనిపోయిన భర్తను ఎప్పుడూ గుర్తు చేసుకుంటున్న హీరోయిన్‌కు.. ఇంట్లో వింత వింత సంఘటనలు ఎదురవుతుంటాయి. నిద్రపోతే చాలు.. కలలో ఏదొక రూపం వచ్చి ఆమెతో మాట్లాడటానికి ట్రై చేస్తుంటుంది. అలాగే అర్ధరాత్రి చప్పుళ్లు, ఉదయాన్నే లేచి చూస్తే అడుగు జాడలు.. ఇలా ఒకటేమిటి వింత వింత సంఘటనలు చాలానే జరుగుతాయి. ఫ్రెండ్స్‌కి చెప్తే.. హీరోయిన్ డిప్రెషన్ కారణంగా ఇలా ఫీల్ అవుతోందని అనుకుంటారు. ఇక అలానే ఓసారి హీరోయిన్ తన ఫ్రెండ్‌ను ఇంటికి పిలుస్తుంది. ఆ తర్వాత అర్ధరాత్రి వేళ ఏదో శబ్దం రావడం.. ఆ అమ్మాయి కనిపించకపోవడం.. హీరోయిన్ ముందే నీళ్ళలోకి దూకడం జరుగుతుంది.
ఓ అజ్ఞాత శక్తి హీరోయిన్‌తో మాట్లాడుతుంది.? ఆమెకే కొన్ని పనులు చెబుతుంది. అనూహ్యంగా ఓ అర్ధరాత్రి హీరోయిన్ బోటులో ఉంటే.. ఆమె ఇంట్లో లైట్స్ ఆన్ అయ్యి ఉంటాయి. అలాగే హీరోయిన్‌కు ఆమె ఇంట్లో ఓ చేతబడి చేసిన బొమ్మ కనిపిస్తుంది. ఇంతకీ ఆ బొమ్మ అక్కడికి ఎలా వచ్చింది. దెయ్యం రూపంలో హీరోయిన్ కలలోకి వచ్చేది ఆమె భర్తా.? లేక మరెవరైనానా.? అనేవి తెలియాలంటే సినిమా చూడాల్సిందే. ఇక ఈ హారర్ మూవీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక ఈ చిత్రం పేరు ‘ది నైట్ హౌస్’. సీన్ సీన్‌కో ట్విస్ట్‌తో అలరించే ఈ భయంకర మూవీలో హారర్ సీన్స్‌తో పాటు పలు బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయి.
ఇది చదవండి: ఒక్క సినిమాతో స్టార్‌డమ్.. వ్యభిచార కేసుతో కెరీర్ మటాష్.. ఈ బ్యూటీ ఎవరో తెల్సా
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి