Chatrapathi Sekhar: ఆమెను నా సొంత బిడ్డల చూసుకున్నా.. డబ్బు సాయం చేసి నష్టపోయా.. ఛత్రపతి శేఖర్..

నటుడు ఛత్రపతి శేఖర్ తెలుగు సినీ, టెలివిజన్ పరిశ్రమలో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా డైరెక్టర్ రాజమౌళి ప్రతి సినిమాలో ఈ నటుడు కీలకపాత్రలు పోషించి తనదైన ముద్రవేశాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన లైఫ్, కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అలాగే సీరియల్ సెట్లలో కొందరు నటుల ప్రవర్తన, అంకితభావం లేకపోవడం తనకు చాలా ఇరిటేషన్ తెప్పిస్తాయని అన్నారు.

Chatrapathi Sekhar: ఆమెను నా సొంత బిడ్డల చూసుకున్నా.. డబ్బు సాయం చేసి నష్టపోయా.. ఛత్రపతి శేఖర్..
Chatrapathi Sekhar (1)

Updated on: Jan 30, 2026 | 10:39 PM

తెలుగు సినిమా, టెలివిజన్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నటుడు ఛత్రపతి శేఖర్. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, పరిశ్రమలోని ప్రస్తుత పోకడలపై ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఆయన అసలు పేరు చంద్రశేఖర్ కాగా, ఛత్రపతి సినిమాతో ఛత్రపతి శేఖర్ గా మారినట్లు గుర్తుచేసుకున్నరు. సీరియల్స్ పరిశ్రమలో వృత్తి నైపుణ్యం లేకపోవడంపై శేఖర్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. సినిమా రంగంలో ఉన్న అంకితభావం, సీన్ పై దృష్టి, హోంవర్క్ సీరియల్స్‌లో కనిపించడం లేదని ఆయన తెలిపారు. ముఖ్యంగా కొందరు నటులు క్యూ డైలాగులు కూడా ప్రాంప్టర్ సహాయంతో చెప్పాల్సి వస్తుందని, భావ వ్యక్తీకరణలోనూ లోపాలు ఉన్నాయని తెలిపారు. సీనియర్ నటులకు సరైన గౌరవం లభించడం లేదని, ఇండస్ట్రీలో మేనేజర్లు, డైరెక్షన్ డిపార్ట్‌మెంట్లు కూడా ఈ విషయంలో విఫలమవుతున్నాయని శేఖర్ ఆరోపించారు. సీరియల్ సెట్లలో కొందరు నటులు ఫోన్లు చూస్తూ, కబుర్లు చెప్పుకుంటూ అంకితభావం లేకుండా ఉండటం తనకు చాలా కోపాన్ని తెప్పిస్తాయని, కొన్నిసార్లు షూటింగ్ వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుందని తెలిపారు. అంకితభావం లేని నటులు దీర్ఘకాలం పరిశ్రమలో నిలబడలేరని ఆయన స్పష్టం చేశారు.

ఎక్కువమంది చదివినవి : Actress Rohini: రఘువరన్‏తో విడిపోవడానికి కారణం అదే.. ఆయన ఎలా చనిపోయాడంటే.. నటి రోహిణి..

నటి కీర్తి భట్ తో తన అనుబంధం గురించి కూడా శేఖర్ మాట్లాడారు. తాను ఆమెను సొంత కూతురులా భావించానని, మనసిచ్చి చూడు సీరియల్ చేసిన సమయంలో ఆమె వల్ల ఆర్థికంగా మూడు, నాలుగు రెట్లు నష్టపోయానని వెల్లడించారు. తన ఎంగేజ్‌మెంట్ కు వెళ్లలేదని కీర్తి అలిగిందని, ప్రస్తుతం తమ మధ్య సంబంధాలు దూరమయ్యాయని తెలిపారు. కీర్తి ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని, స్వతంత్రంగా, సిన్సియర్ గా తన పని చేసుకోవాలని కోరుకుంటున్నానని శేఖర్ అన్నారు. రావాల్సిన డబ్బులు కూడా తిరిగి రాలేదని, వాటి గురించి తాను అడగలేదని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Ramya Krishna : నా భర్తకు దూరంగా ఉండటానికి కారణం అదే.. హీరోయిన్ రమ్యకృష్ణ..

తన కెరీర్ అవకాశాల గురించి మాట్లాడుతూ తాను సినిమాల్లో నటించడానికి సిద్ధంగా ఉన్నానని, అయితే యాక్షన్ సన్నివేశాలలో రోప్ వర్క్, ఫైట్లు తన వెనుక భాగాన వచ్చిన గాయం కారణంగా కొంత సమస్య అని తెలిపారు. అలాంటివి లేకుండా మంచి క్యారెక్టర్లు వస్తే చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పారు. ఫైనాన్షియల్ గా తాను కంఫర్ట్ గా ఉన్నానని, తన కుటుంబ సభ్యులు కూడా బాగా ఉన్నారని, తన భార్య యూఎస్‌లో ఉద్యోగం చేస్తుందని, కూతురు కూడా ఉద్యోగం చేస్తుందని వివరించారు. తన కుమారుడు 25 సంవత్సరాలు ఉంటాడని, ముంబైలో నటనలో శిక్షణ తీసుకున్నాడని, అతనికి మంచి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నానని శేఖర్ వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: ఏంటండీ మేడమ్.. అందంతో చంపేస్తున్నారు.. నెట్టింట సీరియల్ బ్యూటీ అరాచకం.. ఫ్యాన్స్ రియాక్షన్ ఇదే..

ఎక్కువమంది చదివినవి : Tollywood : అప్పుడు రామ్ చరణ్ క్లాస్‏మెట్.. ఇప్పుడు టాలీవుడ్ డైరెక్టర్.. ఏకంగా చిరుతో భారీ బడ్జెట్ మూవీ..