Tollywood: అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.?

|

Jan 14, 2025 | 1:10 PM

పైన పేర్కొన్న ఫోటోలోని నటిని గుర్తుపట్టారా.? ఈమె ఒకప్పటి లేడీ కమెడియన్.. దాదాపుగా 200కిపైగా చిత్రాల్లో నటించింది. ఒక్క కమెడియన్‌గా మాత్రమే కాదు.. హీరోయిన్‌గా, సెకండ్ హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇలా వివిధ పాత్రల్లో నటించి.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి..

Tollywood: అప్పుడు స్టార్ కమెడియన్.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది.. ఎవరో గుర్తుపట్టారా.?
Tollywood
Follow us on

కమెడియన్‌గా, హీరోయిన్‌గా.. సెకెండ్ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్టు.. ఇలా వివిధ పాత్రల్లో నటించిన ఈమె దాదాపు 200కిపైగా చిత్రాల్లో నటించింది. ఈ నటి ఎవరో గుర్తుపట్టారా.? 1980వ దశకంలో తెలుగు ఇండస్ట్రీని ఓ ఊపేసింది ఈ హీరోయిన్. అంతేకాదు.. ఈమె మన తెలుగు అమ్మాయి కూడా. కానీ మలయాళం ఇండస్ట్రీ ద్వారా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె మరెవరో కాదు.. అనూజ రెడ్డి. అనూజ స్వస్థలం గుంటూరు. అయితే ఆమెకు మూడేళ్లు ఉన్నప్పుడు కుటుంబం చెన్నై వెళ్లి స్థిరపడింది. అనూజ 14 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఓ సినిమా కోసం చిత్ర యూనిట్ వెతుకుతుండగా.. అనూజను చూడటం ఎంపిక చేయడం జరిగింది.

ఇక 80వ దశకంలో బ్రహ్మానందం, అనూజ మధ్య వచ్చిన ప్రతీ కామెడీ సీన్ సూపర్ హిట్ అని చెప్పొచ్చు. ‘చంటి’, ‘పెళ్లి చేసుకుందాం’ లాంటి సినిమాలతో అనూజ మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2004లో అనూజ రెడ్డి చివరిసారిగా సినిమాల్లో కనిపించింది. అనంతరం పెళ్లి చేసుకుని సినిమాలకు పూర్తిగా దూరమయ్యింది. అనూజరెడ్డికి ఓ కుమారుడు ఉన్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే అనూజ రెడ్డి.. ఎప్పటికప్పుడు తన వ్యక్తిగత విషయాలతో ఇన్‌స్టా ద్వారా ఫ్యాన్స్‌తో పంచుకుంటోంది. అప్పుడేమో కామెడీతో అలరించిన ఈమె.. ఇప్పుడేంటి ఇలా మారిపోయింది అంటూ నెటిజన్లు వరుసపెట్టి కామెంట్స్‌తో హోరెత్తిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి