Dasara: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దసరా సాంగ్.. ఎక్కడ చూసిన చమ్కీల ఆంగి పాటే

దసరా సినిమాలోని సూపర్ డూపర్ హిట్టైన ఇదే పాట.! నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జోడిగా.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా సినిమాలోని ఈ పాట రిలీజ్‌ అయిన దగ్గర నుంచి అందర్నీ మైండ్‌లలో కొలువైపోయింది.

Dasara: సోషల్ మీడియాను షేక్ చేస్తోన్న దసరా సాంగ్.. ఎక్కడ చూసిన చమ్కీల ఆంగి పాటే
Chamkeela Angeelesi
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 16, 2023 | 9:17 AM

రీసెంట్ డేస్లో.. రీల్స్‌దే హవా.. ! యూట్యూబ్లో అయితే షార్ట్స్‌దే హవా! ఇక వీటిలో కూడా.. తరుచుగా.. వద్దన్నా .. కనిపిస్తోంది చమ్కీల అంగీలేసి పాట. దసరా సినిమాలోని సూపర్ డూపర్ హిట్టైన ఇదే పాట.! నేచురల్ స్టార్ నాని కీర్తి సురేష్ జోడిగా.. శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో తెరకెక్కిన దసరా సినిమాలోని ఈ పాట రిలీజ్‌ అయిన దగ్గర నుంచి అందర్నీ మైండ్‌లలో కొలువైపోయింది. అందరి నోటి నుంచి ఇదే పాట కూనిరాగమై వస్తోంది. చిన్నా చితాకా.. ముసలీ ముతకా అని తేడా లేకుండా.. అందర్నీ కాలు కదిపేలా చేస్తోంది. అలా సోషల్ మీడియా రీల్స్‌ కెక్కి.. ప్రతి పది రీల్లో ఆరు రీల్స్ ఇదే ఉంటోంది. వైరల్ అవడంతో.. మరీ పరాకాష్టకు వెళిపోయింది. సోషల్ మీడియాను పట్టి పీడిస్తోందనే ఫన్నీ కామెంట్ కొంత మంది నుంచి వచ్చేలా చేసుకుంటోంది.

అచ్చ తెలంగాణ పల్లె బాణీని.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్అడాప్ట్ చేసుకున్న తీరు.. తెలంగాణ వూర్లలో… వాడుక భాషలోని పదాలను సాహిత్యంగా కూర్చిన రైటర్ కాసర్ల శ్యామ్‌ నేర్పు! ఈ సాంగ్‌ను నెక్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. పాన్ ఇండియా రేంజ్‌లో అందరికీ చేరువయ్యేలా చేసింది. రీల్స్ రూపంలో సోషల్ మీడియాలను ఊగిపోయేలా చేస్తోంది.

అంతేకాదు.. యూట్యూబ్‌లో ఇప్పటికీ ఈ సాంగ్ ట్రెండ్ అవుతూనే ఉంది. దాదాపు 56 మిలియన్ వ్యూస్‌ దక్కించుకుని.. ఇంకా దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకుంటూనే ఉంది. అందర్నీ ఈ సాంగ్‌కు డ్యాన్స్ చేసేలా .. రీల్స్‌చేసేలా టెంప్ట్‌ చేస్తూనే ఉంది.