Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. అద్దం పగలకొట్టి..

కారు అద్దం పగలకొట్టి నగదు ఖరీదైన మద్యం సీసాలను, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జర్నలిస్ట్ కాలనీలో జరిగినట్లుగా సమాచారాం. జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్ పేరుతో ఉన్న కార్యాలయం వద్ద పార్కు చేసిన బెంజ్ కారులో చోరీ జరిగింది.

Bellamkonda Suresh: నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ.. అద్దం పగలకొట్టి..
Bellamkonda Suresh

Updated on: Jun 10, 2023 | 8:50 AM

తెలుగు సినీ పరిశ్రమలో సినీ నిర్మాత సినీ నిర్మాత బెల్లంకొండ సురేష్ కారులో చోరీ జరిగింది. గురువారం ఈ ఘటన చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కారు అద్దం పగలకొట్టి నగదు ఖరీదైన మద్యం సీసాలను, కొంత నగదును గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటన జర్నలిస్ట్ కాలనీలో జరిగినట్లుగా సమాచారాం. జర్నలిస్ట్ కాలనీలోని సాయి గణేష్ ప్రొడక్షన్ పేరుతో ఉన్న కార్యాలయం వద్ద పార్కు చేసిన బెంజ్ కారులో చోరీ జరిగింది.

గురువారం మధ్యాహ్నం సురేష్ కు చెందిన బెంజికారును కార్యాలయం ముందు నిలిపారు. శుక్రవారం ఉదయం చూడగ కారు ఎడమవైపు వెనుక సీటువద్ద అద్దం పగిలి ఉంది. వెళ్లి చూడగా.. లోపల ఉంచిన కారులో 50వేల నగదు 11 ఖరీదైన మద్యం సీసాలు దొంగలించారు. ఒక్కొక్క మద్యం సీసా ఖరీదు 28,000 ఉన్నట్లు తెలుస్తోంది. నగదు, మద్యం సీసాలు చోరీకి గురికావడంతో కార్యాలయం సిబ్బంది జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.