RGV : రామ్ గోపాల్ వర్మ పై పోలీసు కేసు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు

ఏపీలోని రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు ఆర్జీవీ. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ రకరకాల పోస్ట్ లు, కామెంట్స్ షేర్ చేస్తున్నారు.

RGV : రామ్ గోపాల్ వర్మ పై పోలీసు కేసు.. దర్యాప్తు చేస్తున్న పోలీసులు
Rgv

Updated on: Nov 11, 2024 | 1:10 PM

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పై పోలీసు కేసు నమోదు.. మద్దిపాడు పియస్‌లో సినీ దర్శకుడు ఆర్‌జివిపై కేసు నమోదు అయ్యింది. ఆర్జీవీ వ్యూహం అనే సినిమా తెరకెక్కించిన విషయం తెలిసిందే.. ఏపీలోని రాజకీయాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారు ఆర్జీవీ. ఈమేరకు ఆయన సోషల్ మీడియాలో ఈసినిమాను ప్రమోట్ చేస్తూ రకరకాల పోస్ట్ లు, కామెంట్స్ షేర్ చేస్తున్నారు. తాజాగా ఆర్జీవీ ఎక్స్‌లో వ్యూహం సినిమా పోస్టర్లు పోస్ట్‌ చేసి ఏపీ ముఖ్యమంత్రి, డిప్యూటి సీఎం, మంత్రి లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.

ఇది కూడా చదవండి : Life of Pi : లైఫ్ ఆఫ్ పై సినిమాలో చేసిన ఈ చిన్నది గుర్తుందా.? ఇప్పుడు ఆమెను చూస్తే దిమ్మ తిరగాల్సిందే

రామ్ గోపాల్ వర్మగురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంచలన సినిమాలను తెరకెక్కిస్తూ ఎప్పుడు వివాదాలతో సావాసం చేస్తుంటారు ఆర్జీవీ. అలాగే ఆయన రాజకీయంగా నేపథ్యంలో పలు సినిమాలను కూడా తెరకెక్కించారు. ఏపీ ఎన్నికల సమయంలో ఆర్జీవీ వ్యూహం అనే సినిమాను విడుదల చేసిన విషయం తెలిసిందే.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ఇవి కూడా చదవండి