Tollywood : ఈ ఫొటోలో ఉన్న చిన్నారులు ఇప్పుడు స్టార్స్.. ఒకరు మీకు తెలుసు.. మరొకరు ఎవరబ్బా..!!
పై ఫోటోను గమనించారా..? ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు స్టార్స్. అందులో అబ్బాయిని గుర్తుపట్టొచ్చు గుర్తుపట్టొచ్చు మనం ముందుగా మాట్లాడుకున్న తేజ సజ్జానే ఆ చిన్నోడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించాడు తేజ. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు హీరోగా మారిపోయాడు.

ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించిన చాలా మంది ఇప్పుడు హీరో హీరోయిన్స్ గా రాణిస్తున్నారు. ఒకప్పుడు స్టార్ హీరోల కొడుకులుగా నటించిన బుడతలు ఇప్పుడు ఏకంగా ఆ స్టార్ హీరోలతో సరిసమానంగా సినిమాలు చేసి మెప్పిస్తున్నారు అలాంటి వారిలో తేజ సజ్జ, కావ్య కళ్యాణ్ రామ్ ఇలా చాలా మంది ఉన్నారు. పై ఫోటోను గమనించారా..? ఆ ఫొటోలో ఉన్న ఇద్దరు చిన్నారులు ఇప్పుడు స్టార్స్. అందులో అబ్బాయిని గుర్తుపట్టొచ్చు గుర్తుపట్టొచ్చు మనం ముందుగా మాట్లాడుకున్న తేజ సజ్జానే ఆ చిన్నోడు. చైల్డ్ ఆర్టిస్ట్ గా చాలా సినిమాల్లో నటించాడు తేజ. మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్, వెంకటేష్, నాగార్జున, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి మెప్పించాడు. ఇక ఇప్పుడు హీరోగా మారిపోయాడు.
అయితే అతని పక్కన ఉన్న చిన్నదాన్ని గుర్తుపట్టరా..? ఆమె కూడా ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఇంతకు ఆ చిన్నారి ఎవరో కనిపెట్టారా..? కష్టంగా ఉందా అయితే మీకొక క్లూ పై ఫోటో సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలోది. ఇప్పుడు కనిపెట్టొచ్చు అనుకుంటా..
ఆ చిన్నారి ఎవరో కాదు హీరోయిన్ శ్రీ దివ్య. మహేష్ బాబు నటించిన యువ రాజు సినిమాలో తేజ సజ్జ, శ్రీదివ్య చైల్డ్ ఆర్టిస్ట్ లుగా కనిపించారు. తేజ టాలీవుడ్ లో సినిమాలు చేస్తుంటే.. శ్రీదివ్య తమిళ్ ఇండస్ట్రీలో బిజీగా మారిపోయింది. తెలుగులోనూ సినిమాలు చేసింది శ్రీ దివ్య. బస్టాప్, కేరింత లాంటి సినిమాల్లో నటించింది. ఆతర్వాత తమిళ్ కు చెక్కేసింది. ప్రస్తుతం శ్రీ దివ్య రైడ్ అనే సినిమా చేస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తేజ టాలీవుడ్ లో హనుమాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది.
View this post on Instagram
శ్రీదివ్య ఇన్ స్టా గ్రామ్ లేటెస్ట్ పోస్ట్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



