
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్స్ వస్తుంటారు. ఒకటి రెండు చిత్రాలతోనే స్టార్ డమ్ సంపాదించుకున్న తారలు ఉన్నారు. మరికొందరు తొలి సినిమాతోనే భారీ డిజాస్టర్ ఖాతాలో వేసుకుంటారు. దీంతో ఆ తర్వాత ఊహించని విధంగా తెలుగు చిత్రాలకు దూరమవుతుంటారు. హిందీ, కన్నడ, మలయాళీ భాషలకు చెందిన అమ్మాయిలు తెలుగులో కథానాయికలుగా దూసుకుపోతుంటారు. పైన ఫోటోలో రాజకుమారిలా ముస్తాబైన ఈ హీరోయిన్ తెలుగు సినిమాతోనే నటిగా తెరంగేట్రం చేసింది. కానీ అందం, అభినయంతో మెప్పించినప్పటికీ అదృష్టం మాత్రం కలిసిరాలేదు. ఆమె నటించిన తొలి చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఈ అమ్మడు .. అక్కడే బ్యాక్ టూ బ్యాక్ సినిమాల్లో నటిస్తూ స్టార్ డమ్ సంపాదించుకుంది.
ఇవి కూడా చదవండి : Nayanthara : అతడితో నటించాలా.. ? వంద కోట్లు ఇచ్చినా ఆ హీరోతో సినిమా చేయను.. నయనతార..
ఈ అమ్మడు కుర్రవాళ్ల హాట్ ఫేవరేట్. తెలుగులో కేవలం రెండు సినిమాల్లో నటించింది. ఫస్ట్ మూవీ అట్టర్ ప్లాప్ కాగా.. సెకండ్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. అయినప్పటికీ తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.3 కోట్ల వరకు వసూలు చేస్తుంది. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు.. బీటౌన్ బ్యూటీ దిశా పటానీ. తెలుగులో లోఫర్ సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. వరుణ్ తేజ్ నటించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేదు. దీంతో హిందీలో వరుస సినిమాలు చేస్తూ అక్కడే బిజీ అయ్యింది.
ఇవి కూడా చదవండి : Racha Movie : ఏంట్రా బాబూ ఈ అమ్మాయి.. హీరోయిన్లకు మించిన అందం.. రచ్చ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడు గ్లామర్ సెన్సేషన్..
చాలా కాలం తర్వాత ప్రభాస్ జోడిగా కల్కి చిత్రంలో నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కల్కి సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇటీవల సూర్య జోడిగా కంగువ చిత్రంలో కనిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చీరకట్టులో మరింత అందంగా మెరిచింది.
ఇవి కూడా చదవండి : Telugu Cinema: ఏంటీ మేడమ్ ఇలా.. ప్రభాస్తో బ్లాక్ బస్టర్ హిట్.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా.. ఎవరంటే..
ఇవి కూడా చదవండి : Actress : 19 ఏళ్ల వయసులో 32 ఏళ్ల హీరోతో ప్రేమ, పెళ్లి.. 11 సంవత్సరాలకు రీఎంట్రీ ఇస్తున్న హీరోయిన్..