పైన ఫోటోను చూశారు కదా.. అందులో కాశ్మీరీ సంప్రదాయ దుస్తులు ధరించిన ఓ అమ్మాయి ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరలవుతుంది. అప్పట్లో తెలుగు, తమిళం, మలయాళం భాషలలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అగ్ర కథానాయికగా ఓ వెలుగు వెలిగింది. ముఖ్యంగా 80, 90’sలో ఆమె బిజీ హీరోయిన్. మెగాస్టార్ చిరంజీవితో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. అప్పట్లో ఆమెకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కేవలం హీరోయిన్ పాత్రలే కాకుండా అమ్మ, అత్త పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది. ఇప్పటికీ సినిమాల్లో చాలా చురుకుగా ఉంది. మరోవైపు రాజకీయాల్లోనూ అడుగుపెట్టింది. ఇంతకీ ఆమె ఎవరా అనుకుంటున్నారా.. ? తనే సీనియర్ హీరోయిన్ రాధిక శరత్ కుమార్.
రాధిక శరత్ కుమార్ సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ సినీనటుడు, హాస్యనటుడు ఎంఆర్ రాధ కుమార్తె. పైన కనిపిస్తున్న ఆమె ఆమె నటించిన శ్రీలంక గీతా చిత్రంలోనిది. 1978లో డైరెక్టర్ భారతీరాజా తెరకెక్కించిన ఇష్కిష్కే పోమియా రైల్ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టిన రాధిక.. ఆ తర్వాత వరసు అవకాశాలు అందుకుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో మెగాస్టార్ చిరంజీవి, రాధిక హిట్ పెయిర్. అలాగే కమల్ హాసన్, రాధిక కలిసి నటించిన స్వాతిముత్యం సినిమా ఇప్పుటికీ క్లాసికల్ సూపర్ హిట్.
రాధిక తన తోటి నటుడు, శరత్ కుమార్ ను 2001లో పెళ్లి చేసుకున్నారు. వీరికి రాహుల్,ర్యానే హార్డీ అనే పిల్లలు ఉన్నారు. కథానాయికగానే కాకుండా దర్శకురాలిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. రాడాన్ మీడియా వర్క్ ఇండియ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు. అలాగే ఇప్పటివరకు జాతీయ అవార్డు, ఆరు ఫిల్మ్ పేర్ అవార్డ్స్,రెండు నంది అవార్డ్స్, తమిళనాడు ప్రభుత్వ రాష్ట్ర చలనచిత్ర అవార్డును మూడు సార్లు గెలుచుకుంది. ప్రస్తుతం రాధిక శరత్ కుమార్ బీజేపీ పార్టీలో చేరారు. ఈ ఏడాది ఎంపీగా పోటీ చేసి ఓడిపోయింది. ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉంది.
ఇది చదవండి : Tollywood: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు మోడ్రన్‌గా.. చెప్పవే చిరుగాలి హీరోయిన్ను ఇప్పుడు చూస్తే షాకే..
Tollywood: ఫోక్ సాంగ్‌తో ఫేమస్ అయిన వయ్యారి.. హీరోయిన్గా అదరగొట్టేసింది..
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.