Tollywood: సినిమాల్లో నటించి ఇప్పుడు బుల్లితెరపై సెటిల్.. ఈ యాంకరమ్మ అందం ముందు హీరోయిన్స్ సైతం సైడ్ అవ్వాల్సిందే..

ప్రస్తుతం బుల్లితెరపై ఆమె తోపు యాంకర్. అందంలో హీరోయిన్స్ సైతం దిగదుడుపే. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అల్లరి గురించి చెప్పక్కర్లేదు. యాంకరింగ్ తో అదరగొడుతున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పుడప్పుడు సినిమాల్లోనూ నటిస్తుంది. ఇప్పుడు ఆమే చేసే షోస్ బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ రేటింగ్ అందుకుంటున్నాయి. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరంటే..

Tollywood: సినిమాల్లో నటించి ఇప్పుడు బుల్లితెరపై సెటిల్.. ఈ యాంకరమ్మ అందం ముందు హీరోయిన్స్ సైతం సైడ్ అవ్వాల్సిందే..
Sreemukhi

Updated on: Apr 27, 2025 | 3:22 PM

ప్రస్తుతం ఆమె బుల్లితెరపై తోపు యాంకర్. అందంతోపాటు మాటల గారడితో ప్రేక్షకులను అలరిస్తుంది. ఓవైపు యాంకరింగ్ చేస్తూనే మరోవైపు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలలో నటిస్తుంది. అలాగే సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ.. ఫోటోషూట్స్ షేర్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. తాజాగా ఈ అందాల యాంకరమ్మ చిన్ననాటి ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. పైన ఫోటోలో తన తండ్రితో కలిసి ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు తెలుగులో టాప్ యాంకర్. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా.. ? ఈ అమ్మడు బుల్లితెరపై సెన్సెషన్.. ఆమె షో వస్తుందంటే చాలా ప్రేక్షకులను తెలియని ఉత్సాహం వస్తుంది. ఆమె వాక్చాతుర్యం, మాస్ యాంగిల్ తో బుల్లితెరపై రాములమ్మగా ట్యాగ్ సొంతం చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టరా? తనే యాంకర్ శ్రీముఖి.

తెలంగాణలోని నిజామాబాద్ ప్రాంతానికి చెందిన శ్రీముఖి ఈటీవీలో ప్రసారమయ్యే అదుర్స్ అనే డ్యాన్స్ షో ద్వారా యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. ఆ తర్వాత అల్లు అర్జున్ నటించిన జులాయి సినిమాలో బన్నీ చెల్లి పాత్రలో కనిపించింది. ఆ తర్వాత రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలోనూ కీలకపాత్ర పోషించింది. సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషిస్తూనే మరోవైపు బుల్లితెరపై యాంకర్ గా మరోసారి కెరీర్ స్టార్ట్ చేసింది. పటాస్ షో ద్వారా తెలుగు రాష్ట్రాల్లో విపరీతమైన ఫేమ్ సంపాదించుకుంది. ఇక చాలా కాలంగా సినిమాల్లో కనిపించడం లేదు శ్రీముఖి. కానీ ప్రస్తుతం బుల్లితెరపై పలు షోలతో చాలా బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఓవైపు యాంకర్ గా బిజీగా ఉన్న శ్రీముఖి అటు సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెట్టింట సందడి చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు తన చిన్ననాటి జ్ఞాపకాలను పంచుకుంది. అలాగే ఇప్పుడు బుల్లితెరపై అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే యాంకర్లలో శ్రీముఖి ఒకరని సమాచారం.

ఇవి కూడా చదవండి :  

Tollywood: 65 ఏళ్ల హీరోతో 29 ఏళ్ల హీరోయిన్ రోమాన్స్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..

Peddi Movie: అప్పుడు రామ్ చరణ్ సరసన.. ఇప్పుడు పెద్ది మూవీలో స్పెషల్ సాంగ్.. ఇక రచ్చ రచ్చే..

Tollywood: తెలుగులో తోపు హీరోయిన్.. ఎఫైర్ బయటపెట్టిందని పగబట్టిన హీరో.. నాలుగే సినిమాలకే ఫెడౌట్..

OTT Movie: బాబోయ్.. ఈ సినిమాను ఫ్యామిలీతో కలిసి అస్సలు చూడలేరు.. ఓటీటీలో రొమాంటిక్ మూవీ రచ్చ..