ఇండస్ట్రీలో సూపర్ హీరోయిన్.. కట్ చేస్తే.. ముగ్గురు పిల్లలు ఉన్న నిర్మాతతో పెళ్లి.. ఇప్పుడు రాజకీయాల్లో సెన్సేషన్..

తన తొలి చిత్రానికి రూ. 10 పారితోషికం తీసుకున్న ఓ నటి.. తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో చక్రం తిప్పింది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా మారింది. తన కెరీర్‌లో అత్యున్నత స్థాయిలో ఉన్నప్పుడు నిర్మాతను ప్రేమించి పెళ్లి చేసుకుంది. కానీ అప్పటికే అతడికి పెళ్లై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇంతకీ ఆమె ఎవరో మీకు తెలుసా.. ?

ఇండస్ట్రీలో సూపర్ హీరోయిన్.. కట్ చేస్తే.. ముగ్గురు పిల్లలు ఉన్న నిర్మాతతో పెళ్లి.. ఇప్పుడు రాజకీయాల్లో సెన్సేషన్..
Jayaprada

Updated on: Oct 16, 2025 | 9:10 PM

సినిమా ప్రపంచంలో ఒకప్పుడు ఆమె టాప్ హీరోయిన్. బాలనటిగా సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆమె, ఆ తర్వాత తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. శోభన్ బాబు, కృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంది. అప్పట్లో అత్యధిక పారితోషికం తీసుకునే కథానాయికగా ఓ ఇమేజ్ సంపాదించుకుంది. కానీ కెరీర్ మంచి ఫాంలో ఉండగానే పెళ్లై పిల్లలు ఉన్న నిర్మాతను పెళ్లి చేసుకుంది. దీంతో అప్పట్లో ఆమె పెళ్లి గురించి ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ? తనే సీనియర్ హీరోయిన్ జయప్రద. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా మారింది. జయప్రద క్లాసికల్ డ్యాన్సర్‌గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

ఇవి కూడా చదవండి : Serial Actress: అబ్బబ్బో.. అదరగొట్టేస్తోన్న రుద్రాణి అత్త.. నెట్టింట గ్లామర్ గత్తరలేపుతున్న సీరియల్ విలన్..

జయప్రద 1974లో 13 సంవత్సరాల వయసులో ‘భూమికోసం’ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి తెరంగేట్రం చేసింది. ఆ సినిమాకు ఆమె మొదటి జీతం కేవలం రూ.10 కావడం విశేషం. 1976లో, ఆమె కమల్ హాసన్ తో కలిసి ‘మన్మద లీలై’ చిత్రంతో తమిళ సినిమాల్లోకి అడుగుపెట్టింది. తెలుగు, తమిళం, హిందీ, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించింది. అప్పట్లో ఇండస్ట్రీని ఏలేస్తున్న స్టార్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆమె తక్కువ వ్యవధిలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణులలో ఒకరిగా మారింది. అయితే సినిమా రంగంలో జయం సాధించినప్పటికీ, జయప్రద వ్యక్తిగత జీవితం తరచుగా వివాదాల్లో చిక్కుకుంది. 1986లో, ముగ్గురు పిల్లల తండ్రి అయిన శ్రీకాంత్ నహాదాతో ఆమె వివాహం చాలా వివాదాలకు దారితీసింది.

ఇవి కూడా చదవండి : 43 ఏళ్ల వయసులో ఇంత స్లిమ్‏గా.. ఈ హీరోయిన్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనట..

పెళ్లి తర్వాత కూడా ఆమె ఇండస్ట్రీలో యాక్టివ్ గానే ఉంది. ఒకప్పుడు హీరోయిన్ గా అలరించిన ఆమె.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారింది.యంగ్ హీరోల సినిమాల్లో కీలకపాత్రలు పోషించింది. సీతా స్వయంవరం, సాగర సంగమం, దేవత వంటి చిత్రాలతో మరింత పాపులర్ అయ్యింది. సీనియర్ ఎన్టీఆర్ ఆహ్వానం మేరకు ఆమె తెలుగుదేశం పార్టీలో చేరింది. రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేశారు. 2019లో ఆమె బీజేపీలో చేరారు.

ఇవి కూడా చదవండి : ఆ ఒక్క జ్యూస్.. 51 ఏళ్ల వయసులో మలైక అందం వెనుక రహస్యం ఇదేనట.