Tollywood: తస్సాదియ్యా.. ఏం మారింది భయ్యా.. సినిమాల్లో అలా.. నెట్టింట ఇలా..

సినిమాల్లో తన పాత్ర ప్రాధాన్యతను బట్టి సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాల భీభత్సం సృష్టిస్తుంది. ఈ అమ్మడు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.?

Tollywood: తస్సాదియ్యా.. ఏం మారింది భయ్యా.. సినిమాల్లో అలా.. నెట్టింట ఇలా..
Actress News

Updated on: Sep 26, 2024 | 9:46 AM

సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ ట్రెండ్ కావడం కామన్.. కానీ ఇప్పుడు ఓ హీరోయిన్ లేటేస్ట్ ఫోటో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. ఇప్పుడిప్పుడే సినీరంగుల ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తున్న ఈ తార.. అతి తక్కువ సమయంలోనే ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఆ ముద్దుగుమ్మ.. ఇప్పుడు గ్లామర్ కాదు.. కంటెంట్ ముఖ్యమంటుంది. ఓ సినిమాలో తన పాత్ర కోసం అడియన్స్ అసలు గుర్తుపట్టని విధంగా మారిపోయింది. పైన ఫోటోను చూశారా.. ? అందులో కనిపిస్తున్న ఆ అమ్మాయి.. ఇప్పుడు కుర్రాళ్ల ఆరాధ్య దేవత. హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ రోల్స్ కాదు.. నటన ప్రాధాన్యత ఉన్న ప్రతి సినిమా ముఖ్యమే అంటోంది. సినిమాల్లో తన పాత్ర ప్రాధాన్యతను బట్టి సహజమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న ఈ హీరోయిన్.. ఇప్పుడు సోషల్ మీడియాలో మాత్రం అందాల భీభత్సం సృష్టిస్తుంది. ఈ అమ్మడు తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అందుకే ఇప్పుడిప్పుడే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుంది. ప్రస్తుతం ఈ అమ్మడు నటిస్తున్న తెలుగు సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇంతకీ ఈ వయ్యారి ఎవరో తెలుసా.? తనే హీరోయిన్ దివ్య భారతి.

మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ హీరోగా నటించిన బ్యాచిలర్ సినిమాతో కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది దివ్యభారతి. ఫస్ట్ మూవీతోనే రొమాంటిక్ సీన్స్ లో రెచ్చిపోయింది. అందం, అభినయంతో కుర్రకారును కట్టిపడేసింది. దీంతో ఈ అమ్మడుకు ఒక్కసారిగా ఫాలోయింగ్ పెరిగిపోయింది. 1992 జనవరి 28న జన్మించిన దివ్యభారతి.. గ్రాడ్యూయేషన్ అనంతరం నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఫస్ట్ మూవీతోనే యువతలో ఎక్కడలేని క్రేజ్ సంపాదించుకుంది. బ్యాచిలర్ సినిమా తర్వాత ఈ బ్యూటీకి వరుస ఆఫర్స్ వచ్చాయి.

ఇవి కూడా చదవండి

మధిల్ మెల్ కాదల్, కింగ్ స్టన్, ఆసై, మహారాజా వంటి చిత్రాలతో మరోసారి ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం తెలుగులో సుడిగాలి సుధీర్ సరసన G.O.A.T – Greatest Of All Time అనే సినిమాలో నటిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్, సాంగ్ ఆకట్టుకున్నాయి. తెలుగులో దివ్యభారతికి ఇదే ఫస్ట్ మూవీ. కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ త్వరలోనే అడియన్స్ ముందుకు రాబోతుంది. అలాగే ఈ చిత్రం తర్వాత తెలుగులో ఈ బ్యూటీకి మరిన్ని ఆఫర్స్ రావడం ఖాయంగా తెలుస్తోంది. ప్రస్తుతం జర్నీ అనే వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.