Tollywood: హీరోయిన్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. లేడీ గెటప్పులో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?

ఈ మధ్యన స్టార్ హీరోలు సైతం లేడీ గెటప్పుల్లో అలరిస్తున్నారు. చీర కట్టుకుని మరీ డ్యాన్సులు, ఫైట్స్ చేస్తున్నారు. అలా తాజాగా మరో స్టార్ హీరో చీర కట్టుతో అదరగొట్టాడు. లేడీ గెటప్ లో అసలు గుర్తు పట్టలేని విధంగా కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు.

Tollywood: హీరోయిన్ అనుకుంటే పప్పులో కాలేసినట్లే.. లేడీ గెటప్పులో ఉన్న ఈ స్టార్ హీరోను గుర్తు పట్టారా?
Shiva Rajkumar in 45 movie

Updated on: Dec 16, 2025 | 6:11 PM

పై ఫొటోలో ఉన్నదెవరో గుర్తు పట్టారా? చీరకట్టులో ఠక్కున చూసి ఎవరో హీరోయిన్ అనుకున్నారా? అయితే పప్పులో కాలేసినట్లే. అందులో ఉన్నది స్టార్ హీరో. ఈ మధ్యన స్టార్ హీరోలు సైతం డిఫరెంట్ పాత్రలకు సై అంటున్నారు. ముఖ్యంగా లేడీ గెటప్పులతో అదరగొట్టేస్తున్నారు. ఆ మధ్యన కన్నడ బ్లాక్ బస్టర్ ‘సు ఫ్రమ్ సో’ సినిమాలో స్టార్ నటుడు, డైరెక్టర్ రాజ్ బి. శెట్టి చీరకట్టులో అదరగొట్టాడు. ఇప్పుడు మరో స్టార్ హీరో చీర కట్టుకున్నాడు. లేడీ గెటప్పులో అసలు గుర్తు పట్టలేని విధంగా కనిపించి అభిమానులను సర్ ప్రైజ్ చేశాడు.
ఈ హీరో విషయానికి వస్తే.. ఇతనికి పాన్ ఇండియా రేంజ్ లో గుర్తింపు ఉంది. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. పేరుకు కన్నడ నటుడే అయినా ఇతను తెలుగు ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ప్రస్తుతం తెలుగులో రామ్ చరణ్ సినిమాతో పాటు ఓ తెలంగాణ రాజకీయ నాయకుడి బయోపిక్ లో నటిస్తున్నాడు. 63 ఏళ్ల వయసులో లేడీ గెటప్పులో కనిపించిన ఆయన మరెవరో కాదు కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్ అలియాస్ శివన్న. తన లేటెస్ట్ సినిమా ’45’ కోసం ఈ అవతారంలో కనిపించాడీ స్టార్ హీరో. ఈ చిత్రం ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి ఈ లుక్ నెట్టింట బాగా వైరలవుతోంది.

’45’ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో శివన్నతో పాటు రియల్ స్టార్ ఉపేంద్ర, రాజ్ బి శెట్టి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాతో సంగీత దర్శకుడు అర్జున్ జన్య దర్శకుడిగా మారాడు. అంతా అనుకున్నట్లు జరిగి ఉంటే ’45’ సినిమా ఆగస్టులోనే విడుదల కావాల్సి ఉంది. అయితే, గ్రాఫిక్స్ పనుల కారణంగా సినిమా విడుదల తేదీని వాయిదా వేశారు. ఎట్టకేలకు అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇవి కూడా చదవండి

45 సినిమాలో శివన్న లుక్..

’45’ ట్రైలర్‌లో రాజ్ బి శెట్టి, శివరాజ్ కుమార్, ఉపేంద్ర పాత్రలు హైలైట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ట్రైలర్ చివరలో శివరాజ్ కుమార్ అవతారం అందరి దృష్టిని ఆకర్షించింది. కన్నడతో పాటు తెలుగు తదితర భాషల్లోనూ ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

45 సినిమా ట్రైలర్ తెలుగులో..

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .