Actor : శ్రీదేవితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు టాప్ హీరో.. 39 ఏళ్లకే మెదడు శస్త్రచికిత్స.. ఇప్పుడు 3వేల కోట్ల ఆస్తులు..

ప్రస్తుతం ఓ స్టార్ హీరో త్రోబ్యాక్ ఫోటో తెగ వైరలవుతుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో అనారోగ్య సమస్యలతో పోరాటం. కానీ తన ఆత్మవిశ్వాసంతో సవాళ్లను ఎదుర్కోని ఇప్పుడు టాప్ హీరోగా దూసుకుపోతున్నాడు. ఇంతకీ ఈ కుర్రాడిని గుర్తుపట్టారా.. ? అమ్మాయిల డ్రీమ్ బాయ్. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేశాడు. ఇంతకీ ఈ కుర్రాడు ఎవరో తెలుసా...?

Actor : శ్రీదేవితో ఉన్న ఈ కుర్రాడు ఇప్పుడు టాప్ హీరో.. 39 ఏళ్లకే మెదడు శస్త్రచికిత్స.. ఇప్పుడు 3వేల కోట్ల ఆస్తులు..
Hrithik Roshan

Updated on: Aug 12, 2025 | 10:38 PM

ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోహీరోయిన్లల పిల్లలు నటీనటులుగా రాణిస్తున్నారు. కానీ కొందరు మాత్రం ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ సక్సెస్ కాలేకపోతున్నారు. సెలబ్రెటీ ఫ్యామిలీ మాత్రమే కాదు.. ప్రతి క్షణం కష్టపడేతత్వం, ప్రతిభ ఉన్నవారు మాత్రమే ఇండస్ట్రీలో సక్సెస్ అవుతుంటారు. కష్టపడి పనిచేయడం ద్వారా తమకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అందులో ఈ కుర్రాడు ఒకరు. అతను స్టార్ కిడ్, కానీ ఇప్పుడు, ఈ ట్యాగ్ కాకుండా, అతనికి సూపర్ స్టార్ అనే ట్యాగ్ కూడా ఉంది. శ్రీదేవితో కలిసి కనిపించిన ఈ పిల్లవాడు చిన్నతనంలోనే సినిమాల్లో పనిచేయడం ప్రారంభించాడు. జీవితంలో చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. అనారోగ్య సమస్యలను ఎదురించాడు. అతడే హృతిక్ రోషన్.

ఇవి కూడా చదవండి : Cinema: థియేటర్లలో అట్టర్ ప్లాప్.. ఇప్పుడు ఓటీటీని శాసిస్తోన్న సినిమా.. ఎక్కడ చూడొచ్చంటే..

ఇవి కూడా చదవండి

హృతిక్ బాల్యం అంత సులభం కాదు. ఒకప్పుడు స్కూల్లో తన నత్తి కారణంగా అతన్ని ఎగతాళి చేసేవారు. దీంతో తనకు స్కూల్ ఎంతో భయానక ప్రదేశంగా మారిందని గతంలో ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అందరి ముందు మాట్లాడేందుకు సిగ్గుపడేవాడినని తెలిపారు. అలాగే అతడికి వెన్నుముక సమస్య కూడా ఉంది. దీంతో వైద్యులు నువ్వు డ్యాన్స్ చేయలేవు, నటుడిగా మారడం మర్చిపో అని చెప్పారు. దీంతో తన జీవితం పూర్తిగా చీకటి మయంగా ఉంటుందని భావించారట. కానీ తన ఆత్మవిశ్వసంతో సినీరంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సూపర్ హిట్స్ అందించారు. ఇప్పుడు వార్ 2 మూవీతో రానున్నారు.

ఇవి కూడా చదవండి : Arundhathi: కొరియోగ్రాఫర్‏ను పెళ్లి చేసుకోబోతున్న అరుంధతి చైల్డ్ ఆర్టిస్ట్.. ఫ్రెండ్స్‏తో బ్యాచిలర్ పార్టీ..

హృతిక్ రోషన్ మొత్తం ఆస్తులు రూ. 3000 కోట్లకు పైగా ఉన్నాయి. ముంబైలోని జుహు-వెర్సోవా లింక్ రోడ్‌లో ఆయనకు కోట్ల విలువైన రెండు విలాసవంతమైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి, వీటి విలువ దాదాపు రూ. 165 కోట్లు. అలాగే రూ. 32 కోట్ల విలువైన జుహు అపార్ట్‌మెంట్, లోనావాలాలో 7 ఎకరాల ఫామ్‌హౌస్, ఢిల్లీ, ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో ఆస్తులు ఉన్నాయి. జూలై 7, 2013 న ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో మెదడుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. బ్యాంగ్ బ్యాంగ్’ సినిమా షూటింగ్ సమయంలో అతనికి తలకు గాయం కావడంతో ఈ సమస్య ఏర్పడింది. అతను కొన్ని నెలల విరామం తీసుకొని తిరిగి సినిమాల్లోకి వచ్చాడు.

ఇవి కూడా చదవండి : Cinema : 4 ఏళ్లుగా ఓటీటీని శాసిస్తున్న మహేష్ బాబు సినిమా.. 75 కోట్లు పెడితే రూ.214 కోట్లు కలెక్షన్స్..

ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 9 ఏళ్లుగా ఇండస్ట్రీని శాసిస్తోన్న సినిమా.. ఇప్పటికీ ఓటీటీలో సెన్సేషన్..