Tollywood: ఇండస్ట్రీలో సమ్మె సైరన్.. టాలీవుడ్‏లో రేపటి నుంచి షూటింగ్స్ బంద్..

|

Jun 21, 2022 | 5:13 PM

అంతేకాకుండా ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికి.. రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యులు పిలుపునిచ్చారు.

Tollywood: ఇండస్ట్రీలో సమ్మె సైరన్.. టాలీవుడ్‏లో రేపటి నుంచి షూటింగ్స్ బంద్..
Tollywood
Follow us on

టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్మె సరైన్ మోగించారు సినీ కార్మికులు.. తమకు వేతనాలు పెంచేవరకు షూటింగ్స్‏కు రామని స్పష్టం చేశారు.. రేపటి నుంచి టాలీవుడ్ ఇండస్ట్రీలో సమ్నే ప్రారంభం కానుంది కార్మికులు తెలిపారు.. ఇన్ని రోజులు వరకు వేతనాలు పెంచకుండా పని చేయించుకున్నారని… ఇప్పుడు వేతనాలు పెంచే వరకు షూటింగ్స్‏కు రాకూడదని తిర్మానించారు.. . అంతేకాకుండా ఫెడరేషన్ మీద ఒత్తిడి చేయడానికి.. రేపు ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడికి 24 యూనియన్ సభ్యులు పిలుపునిచ్చారు. రేపు ఉదయం ఫిల్మ్ ఫెడరేషన్ ముట్టడిస్తామని.. అలాగే తమకు సరైన వేతనాలు పెంచేవరకు షూటింగ్స్ నిర్వహించకూడదని తెలిపారు.. రేపటి నుంచి షూటింగ్స్ జరగవని.. సినీ కార్మికులకు సమ్మేకు మద్దతు ఇవ్వాలని తెలిపారు.

“ప్రస్తుతం 24 క్రాఫ్ట్స్ కి సంబంధించి 4వేల మంది కళాకారులు మా ఫెడరేషన్‏లో ఉన్నారు.. షూటింగులు సరిగ్గా జరక్క పోవడంచేత కళాకారులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రం విడిపోయాక ఎన్నో లిమిటెడ్ కంపెనీలు ఇక్కడికి వచ్చాయి.. వీటి నిర్వహణ లోపాలపై ప్రభుత్యం దృష్టి పెట్టాలి.. సినిమాలు అక్కడ తీస్తున్నారు…కలెక్షన్లు ఇక్కడ తీసుకుంటున్నారు. 20శాతం షూటింగ్ ఏపిలో చెయ్యాలని సీఎం చెప్పారు..కానీ ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. ఇక్కడ షూటింగ్‏లు చేస్తే 20 శాతం సాంకేతిక నిపుణులు ఇక్కడి వారు ఉండాలనీ మా డిమాండ్. కళాకారుల, సాంకేతిక నిపుణులు అభివృధి కోసం ఏపి ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ పనిచేస్తుందన్నారు” ఏపీ ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ తోరం రాజా..

ఇవి కూడా చదవండి

Films