దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ (RRR ) బాక్సాఫీస్ వద్ద ఎంత ప్రభంజనం సృష్టించిందో తెలిసిన విషయమే. ఈ సినిమాకు ప్రపంచమే ఫిదా అయ్యింది. జక్కన్న స్క్రీన్ ప్లేకు హాలీవుడ్ డైరెక్టర్స్ ప్రశంసలు కురిపించారు. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించిన ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ రాబట్టింది. ఇటీవలే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్ 2023కు నామినేట్ అవుతుందని భావించారు. కానీ చివరి నిమిషంలో గుజరాతీ ఫిల్మ్ ఛలో షో ఎంపికైంది. ఇక ఇప్పుడు విదేశాల్లో ఆర్ఆర్ఆర్ క్రేజ్ ఎలా ఉందనేది తెలియజేస్తూ ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
కాలిఫోర్నియాలోని ఓ పాఠశాలలో విద్యార్థులు ఆర్ఆర్ఆర్ చిత్రంలోని నాటు నాటు సాంగ్ హిందీ వెర్షన్ ఆలపించారు. విద్యార్థులు అందంగా నాటు నాటు సాంగ్ పాడుతున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇది రాజమౌళి గొప్ప విజయం అని.. ఏ దర్శకుడికి దొరకని అభిమానం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రానికి ఆస్కార్ అవసరం లేదని.. ఇది అంతకంటే ఎక్కువ విజయం అంటూ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా కోసం సిద్ధమవుతున్నారు. వీరిద్దరి కాంబోలో రాబోతున్న సినిమా వచ్చే ఏడాదిలో ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.
ట్వీట్..
Middle school students from California singing RRR naatu naatu song pic.twitter.com/C03mNr7Ifq
— AMERICA_KURRALLU (@AmericaKurrallu) September 25, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.