Bunny Emotional Tweet: గంగోత్రి నుంచి పుష్ప వరకు.. అల్లు అర్జున్‌ సక్సెస్‌ జర్నీ.. 18 ఏళ్ల ప్రస్థానం..

|

Mar 28, 2021 | 2:58 PM

Bunny Emotional Tweet: స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ తన సినిమా కెరీర్‌ను మొదలు పెట్టి నేటితో సరిగ్గా 18 ఏళ్లు పూర్తయ్యాయి. మార్చి 28, 2003లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన 'గంగోత్రి' చిత్రం విడుదలైంది. తొలి చిత్రంతోనే..

Bunny Emotional Tweet: గంగోత్రి నుంచి పుష్ప వరకు.. అల్లు అర్జున్‌ సక్సెస్‌ జర్నీ.. 18 ఏళ్ల  ప్రస్థానం..
Bunny Carrer
Follow us on

Bunny Emotional Tweet: స్టైలిష్ స్టార్‌ అల్లు అర్జున్‌ తన సినిమా కెరీర్‌ను మొదలు పెట్టి నేటితో సరిగ్గా 18 ఏళ్లు పూర్తయ్యాయి. మార్చి 28, 2003లో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘గంగోత్రి’ చిత్రం విడుదలైంది. తొలి చిత్రంతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు బన్నీ.

అంతకు ముందు చిరంజీవి హీరోగా నటించిన ‘డాడీ’ చిత్రంలో ఓ చిన్న పాత్రలో నటించినప్పటికీ అది పెద్దగా ఎవరికి తెలియదు. ఇక గంగోత్రిలో కాస్త యంగ్‌ లుక్‌లో పెద్దగా స్టైలిష్‌గా కనిపించని బన్నీ రెండో చిత్రం ‘ఆర్య’లో పూర్తిగా తన మేకోవర్‌ను మార్చేశాడు. క్రమక్రమంగా ఎదుగుతూ యూత్‌లో ఫుల్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంటూ దూసుకెళ్లాడు. ఈ క్రమంలోనే స్టైలిష్‌ స్టార్‌ అనే బిరుదును దక్కించుకున్నాడు బన్నీ. దేశముదురు, పరుగు, జులాయి, సన్‌ ఆఫ్‌ సత్యమూర్తి, రీసెంట్‌గా అలవైకుంఠపురం ఇలా ఎన్నో విజయాలు నమోదు చేసుకున్నాడు. ఇక ఓ వైపు కమర్షియల్‌ చిత్రాల్లో నటిస్తూనే మరోవైపు వేదం వంటి నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తన సినీ కెరీర్‌ 18 ఏళ్లు నిండిన నేపథ్యంలో తాజాగా బన్నీ ట్విట్టర్‌ వేదికగా ఓ ఎమోషనల్‌ పోస్ట్‌ చేశాడు. ఈ సందర్భంగా బన్నీ ట్వీట్‌ చేస్తూ.. ‘నా మొదటి సినిమా వచ్చి 18 ఏళ్ళు అవుతోంది. ఈ సుదీర్ఘ సినీ ప్రయాణంలో మొదటి నుంచి నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాయి. నా గుండె నిండా వారందరి పట్ల కృతజ్ఞత ఉంది, ఇన్నేళ్లుగా నాపై వారందరు కురిపించిన ప్రేమకు రుణపడి ఉంటనుని’ అంటూ బన్నీ ట్వీట్ చేశాడు. ఇక అల్లు అర్జున్‌ ప్రస్తుతం సుకుమార్‌ దర్శకత్వంలో ‘పుష్ప’ చిత్రంలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో తెరకెక్కుతోంది.

అల్లు అర్జున్ చేసిన ట్వీట్..

Also Read: Gopichand’s Seetimaarr: వాయిదా పడనున్న గోపీచంద్ సీటీమార్ రిలీజ్.. కారణం ఇదే

Radhe Shyam Movie: రాధేశ్యామ్ సినిమానుంచి క్రేజీ అప్డేట్ .. ఖుషీలో రెబల్ స్టార్ అభిమానులు..

న్యూ వెబ్ సిరీస్ స్టార్ట్ చేసిన మెహబూబ్ దిల్‏సే.. నాగార్జున చేతులమీదుగా పోస్టర్ రిలీజ్.. పేరెంటో తెలుసా..