Buchi Babu Sana: రెమ్యునరేషన్ పెంచేసిన ఉప్పెన డైరెక్టర్.. రెండో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే..?

|

Apr 22, 2021 | 6:21 AM

టాలీవుడ్ లో ఇప్పటికే చాలా ప్రేమ కథలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో భారీ ప్రేక్షకాదరణ పొందిన ప్రేమ కథ చిత్రం ఏదైనా ఉంది అంటే అది

Buchi Babu Sana: రెమ్యునరేషన్ పెంచేసిన ఉప్పెన డైరెక్టర్.. రెండో సినిమాకు ఎంత తీసుకుంటున్నాడంటే..?
Follow us on

Buchi Babu Sana: టాలీవుడ్ లో ఇప్పటికే చాలా ప్రేమ కథలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ మధ్యకాలంలో భారీ ప్రేక్షకాదరణ పొందిన ప్రేమ కథ చిత్రం ఏదైనా ఉంది అంటే అది ‘ఉప్పెన’ అనే చెప్పాలి. బుచ్చి బాబు సాన దర్శకత్వం వహించిన ఈ సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. మెగా ఫ్యామిలీ నుంచి సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ సినిమాతో హీరోగా పరిచయం అయ్యారు. ఈ సూపర్ హిట్ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించగా.. డైరెక్టర్ సుకుమార్ సమర్పకుడిగా వ్యవహరించారు. ఇక మొదటి సినిమాతోనే సంచలన విజయాన్ని అందుకున్న బుచ్చిబాబు సానకు ఇప్పుడు అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. కుర్ర హీరోలు ఇప్పుడు బూచి  బాబు వైపే చూస్తున్నారు. ఇదిలా ఉంటే బూచి బాబు రెమ్యునరేషన్ ను భారీగా పెంచేశారని తెలుస్తుంది.

భారీస్థాయిలో లాభాలు రావడం వలన నిర్మాతలు దర్శకుడు బుచ్చిబాబుకు ఒక ‘బెంజ్ కారు’ను బహుమతిగా ఇచ్చారు. అయితే మైత్రిమూవీ మేకర్స్ తో బుచ్చిబాబు మరో సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం భారీగా రెమ్యునరేషన్ అందుకుంటున్నడని తెలుస్తుంది. నెక్స్ట్ సినిమాకు ఏకంగా ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడట బుచ్చిబాబు. ప్రస్తుతం బుచ్చిబాబు కొత్త కథ ను సిద్ధం చేస్తున్నాడట. ఈ సినిమాలో హీరో హీరోయిన్లు ఎవరనేది త్వరలోనే తెలియనుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Prabhas Adipurush: ఆదిపురుష్ మూవీ అప్డేట్ ఇవ్వమని చిత్ర యూనిట్ ని డిమాండ్ చేస్తున్న డార్లింగ్ ఫ్యాన్స్

అనూహ్య నిర్ణయం తీసుకున్న చార్మి.. వాటిని చూసేంత ధైర్యం లేదు.. వదిలేస్తున్నా అంటూ ఎమోషనల్..

చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకున్న హీరోయిన్.. తండ్రితో ఉన్న త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన ముద్దుగుమ్మ..