ప్రస్తుతం బాలీవుడ్ మొత్తం ఆశలు పెట్టుకున్న సినిమా ఏదైనా ఉంది అంటే అది బ్రహ్మాస్త్ర(Brahmāstra )అనే చెప్పాలి. ఇప్పుడు బాలీవుడ్ పరిస్థితి అంతగా బాలేదు. వందల కోట్లు పెట్టి తీసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొడుతున్నాయి. అలాగే సౌత్ సినిమాల జోరు పెరిగింది. దాంతో అక్కడి దర్శక నిర్మాతలంతా ఆలోచనలో పడ్డారు. ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో బాయ్‌కాట్ అనే పదం ఎక్కువగా వినిపిస్తోంది. బాలీవుడ్ లో ఏ సినిమా రిలీజ్ అయినా బాయ్‌కాట్ అనే పదం బాగా ట్రెండ్ అవుతోంది. ఇటీవల రిలీజ్ అయినా అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా సినిమాకు ఫ్లాప్ అవ్వడానికి అదికూడా ఒక కారణం అయ్యింది. దాంతో ఇప్పుడు బాయ్‌కాట్ అనే పదం వింటే దర్శకనిర్మాతల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా బ్రహ్మాస్త్ర సినిమాకు కూడా ఈ సెగ తగిలే అవకాశం కనిపిస్తోంది.
లవర్ బాయ్ రణబీర్ కపూర్ నటిస్తున్న ఈ సినిమాలో అలియా భట్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా పై బాలీవుడ్ చాలా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే టాలీవుడ్ కింగ్ నాగార్జున కూడా ఈ సినిమా ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా సినిమాను మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. అయితే ఇప్పటికే ఈ సినిమాను బాయ్ కాట్ సెగ తగులుతోంది. సోషల్ మీడియాలో కొందరు ఈ సినిమాను కూడా బాయ్‌కాట్ చేయాలంటూ హంగామా చేస్తున్నారు. దాంతో టీమ్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇటీవలే రణబీర్ షంషేరా సినిమాతో దారుణమైన ఫ్లాప్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి మరి.