Nandamuri Balakrishna: నటసింహం అన్‌స్టాపబుల్‌కు నెక్స్ట్ గెస్ట్‌గా నవ్వుల రారాజు..?

నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాతోపాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైన కూడా సత్తా చాటుతున్నారు. త్వరలో అఖండంగా గర్జించనున్న బాలయ్య ..

Nandamuri Balakrishna: నటసింహం అన్‌స్టాపబుల్‌కు నెక్స్ట్ గెస్ట్‌గా నవ్వుల రారాజు..?
Aha

Updated on: Nov 29, 2021 | 8:50 AM

Nandamuri Balakrishna: నటసింహం నందమూరి బాలకృష్ణ సినిమాతోపాటు డిజిటల్ ఫ్లాట్ ఫామ్ పైన కూడా సత్తా చాటుతున్నారు. త్వరలో అఖండంగా గర్జించనున్న బాలయ్య .. ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన ఆహా లో టాక్ షోతో కూడా ఆకట్టుకుంటున్నారు. అన్ స్టాపబుల్ అనే టాక్ షోతో అలరిస్తున్నారు బాలయ్య . ఇప్పటికే ఈ టాక్ షోకు మొదటి గెస్ట్ గా డైలాగ్ కింగ్ మోహన్ బాబు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. బాలయ్య – మోహన్ బాబు మధ్య జరిగిన సరదా సంభాషణలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఆతర్వాత నేచురల్ స్టార్ నాని ఈ టాక్ షోకు హాజరయ్యారు. ఈ ఎపిసోడ్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ కు రెడీ అవుతుంది. ఇటీవల బాలయ్య భుజానికి సర్జరీ అయ్యింది దాంతో ఆయన చిన్న బ్రేక్ తీసుకున్నారు. త్వరలోనే పూర్తిగా కోలుకొని తిరిగి షూటింగ్స్ కు హాజరు కానున్నారు.

అయితే బాలయ్య అన్ స్టాపబుల్ షోకు  నెక్స్ట్ గెస్ట్ నవ్వుల రాజు బ్రహ్మానందం హాజరుకానున్నారని తెలుస్తుంది. గత కొంత కాలంగా బ్రహ్మానందం సినిమాలకు దూరంగా ఉంటున్నారు. చివరిగా జాతిరత్నాలు సినిమాలో కనిపించి నవ్వించారు. త్వరలోనే పంచతంత్ర, రంగమార్తాండ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ క్రమంలో బాలయ్య షో కు ఆయన హాజరు కానున్నారన్న వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తుంది. బాలయ్య అన్ స్టాపబుల్ లో బ్రహ్మానందం పాల్గొనబోతున్నట్లుగా అధికార ప్రకటన త్వరలోనే విడుదల చేయనున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Samantha: చిరిగిన షర్ట్‌కు పిన్నులు పెట్టుకోవడం కూడా ఫ్యాషనేనా.? వైరల్‌గా మారిన సమంత లేటెస్ట్ ఫోటో..

Rashmika: అందాల రష్మిక మోటివేషనల్‌ పోస్ట్‌.. భయాన్ని ఎలా జయించాలో ఎంత బాగా చెప్పిందే చూడండి..

Shivani Rajashekar: చీరకట్టులో ‘అద్భుతం’గా అందాల తార.. శివాని రాజశేఖర్‌ లేటెస్ట్‌ ఫోటోలు చూశారా.?