The Warriorr: రామ్ సినిమా కోసం మాస్ దర్శకుడు ఇలా.. తమిళ్ స్టార్ హీరో అలా..

|

Jul 01, 2022 | 10:07 AM

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు ఈ యంగ్ హీరో.

The Warriorr: రామ్ సినిమా కోసం మాస్ దర్శకుడు ఇలా.. తమిళ్ స్టార్ హీరో అలా..
Ram Pothineni
Follow us on

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని(Ram Pothineni)బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో దూసుకుపోతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు ఈ యంగ్ హీరో. ఇస్మార్ట్ శంకర్, రెడ్ సినిమాతో ఆకట్టుకున్న రామ్ ఇప్పుడు వారియర్ గా రానున్నాడు. తమిళ్ డైరెక్టర్ లింగు స్వామి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో లేటెస్ట్ సెన్సేషన్ కృతిశెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనించనున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఈ మూవీనుంచి వచ్చిన బుల్లెట్ సాంగ్ ఏ రేంజ్ లో ఆకట్టుకుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సత్య ఐపీఎస్ పాత్రలో రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి.. ఇద్దరూ ఆకట్టుకోనున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది.

తాజాగా ఈ సినిమానుంచి ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఈ రోజు ట్రైలర్ ఈవెంట్ ను సాయంత్రం గ్రాండ్ గా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను హాజరుకానున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి ఈ వేడుక మొదలుకానుంది. ఈ వేదికపై రాత్రి 7:57 నిమిషాలకు తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. అలాగే తమిళ్ క్రేజీ హీరో శివ కార్తికేయన్ ఈ ట్రైలర్ డిజిటల్ రిలీజ్ చేయనున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వ‌ర్ స్క్రీన్ పతాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం. 6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ పూర్తయింది. ఇక ఈ సినిమా టీజర్ కు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తున్నాయి. యూట్యూబ్ లో ఈ టీజర్ రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. తెలుగు .. తమిళ భాషల్లో కలుపుకుని 20 మిలియన్ కు పైగా వ్యూస్ రావడం విశేషం. ఈ సినిమాలో విలన్ గా ఆది పినిశెట్టి విలన్ గా నటిస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలో నదియా .. అక్షరగౌడ .. భారతీరాజా ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. జులై 14న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి