ఫుట్‌పాత్‌లపై ఏడుస్తూ నిద్రపోయేవాడిని..తిండిలేక చనిపోదామనుకున్నా.. కానీ ఇప్పుడు

సినిమా ఇండస్ట్రీ అనేది అందరికి ఒకేలా ఉండదు. కొంతమంది స్టార్ కిడ్స్ డైరెక్ట్ గా సినిమాల్లోకి వచ్చేస్తుంటే చాలా మంది మాత్రం స్వయం కృషితో అడుగుపెడుతున్నారు.. రాణిస్తున్నారు. అలాంటి వారిలో ఈ హీరో ఒకరు. ఒకప్పుడు తినడానికి తిండి లేక అలమటించాడు ఆ స్టార్ హీరో.

ఫుట్‌పాత్‌లపై ఏడుస్తూ నిద్రపోయేవాడిని..తిండిలేక చనిపోదామనుకున్నా.. కానీ ఇప్పుడు
Hero

Updated on: Mar 26, 2026 | 2:14 PM

తినడానికి తిండి దొరక్క ఫుట్‌పాత్‌లపై ఏడుస్తూ నిద్రపోయి, చేతుల్లో డబ్బులు లేక అష్టకష్టాలు పడి జీరో స్థాయి నుంచి స్టార్ హీరోగా ఎదిగాడు ఆయన. ఇండస్ట్రీలో తోప్ హీరోగా రాణించాడు. కెరీర్ లో ఉన్నత స్థానాన్ని సొంతం చేసుకోవడమే కాదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. ఇప్పటికీ ఆయన క్రేజ్ అలానే ఉంది. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి. ఈ సీనియర్ హీరో ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శప్రాయం. ఇష్టమైనది సాధించే వరకు కష్టపడుతూ ఉంటారు.. అయితే విజయాలు అందుకోవాలంటే కష్టాలను దాటుకొని ముందుకు రావాల్సిందే అని మిథున్ చక్రవర్తి తన జీవితంతో నిరూపించారు. ఇండస్ట్రీలో గొప్ప నటులుగా పేరుపొందిన ఎంతోమంది కష్టాల కడలను ఈదుకుంటూ వచ్చిన వారే. వారిలో మిథున్ చక్రవర్తి ఒకరు. సినీ ఇండస్ట్రీకి ఎన్నో బ్లాక్‌బస్టర్ హిట్లు అందించిన ఆయన, ఒకానొక సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..

తాను హీరోగా పనికిరానని, తనను ఎవరు తీసుకుంటారని చాలామంది అనుకునేవారట. ఓ షోలో ఆయన మాట్లాడుతూ, అన్నం దొరకని సమయాల్లో ఖాళీ కడుపుతో రోజులు గడిపాను అని గుర్తు చేసుకున్నారు. ఆకలి కేకలతో నన్ను నేను తిట్టుకుంటూ ఏడుస్తూ నిద్రపోయాను అన్నారు. తనకు ఎప్పుడు తిండి దొరుకుతుందా, నిద్రపోవడానికి కాస్త చోటు దొరికితే బాగుండు అని ఆలోచిస్తూ భారంగా కాలాన్ని నెట్టుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆయన తెలిపారు. చాలాసార్లు ఫుట్‌పాత్‌ల మీద నిద్రపోవాల్సి వచ్చింది. ఇండస్ట్రీలో తనను హీరోగా ఎవరు తీసుకుంటారు అనే ఆలోచనతో, విలన్ అవ్వాలని భావించారట. తిండి దొరుకుతుందని పార్టీల్లో డాన్స్ చేసేవాడిని తెలిపారు. పని ఎక్కడ దొరికితే అక్కడికి నడుచుకుంటూ వెళ్ళేవాడిని, నాలుగు మెతుకుల కోసం పార్టీలో డాన్స్ చేసేవాడినని మిథున్ చక్రవర్తి వివరించారు. అయితే ఒకానొక సమయంలో తన ప్రాణాలే తీసుకోవాలని అనుకున్నారట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో మిథున్ చక్రవర్తి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా

తాను అనుకున్నది సాధించలేనేమో అని భయపడేవాడిని అన్నారు. తిరిగి కలకత్తాకి కూడా వెళ్లలేకపోయాను. ఒకానొక సమయంలో చనిపోదాం అనుకున్నాను. కానీ అందరికీ తాను ఇచ్చే సలహా ఒక్కటే అని ఆయన చెప్పారు. ఎవరు జీవితాన్ని ముగించాలనుకోకండి, పోరాడండి. తాను ఫైట్ చేశాను, ఇదిగో ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నాను అని మిథున్ చక్రవర్తి తెలిపారు. మిథున్ చక్రవర్తి 1976లో వచ్చిన మృగయా సినిమాతో వెండితెరపై రంగప్రవేశం చేశారు. ఈ సినిమా జాతీయ అవార్డు అందుకుంది. సురక్ష, డిస్కో డాన్సర్, డాన్స్ డాన్స్, ప్యార్ ఝుక్తా నహి, కసమ్ పైదా కర్నేవాలే కి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో నటించి విశేష గుర్తింపు పొందారు. హీరోగా 80, 90 దశకాల్లో ఆయన చేసిన చిత్రాలు అద్భుతమైన ఆదరణ పొందాయి. ఈయన తెలుగులో గోపాల గోపాల సినిమాలో లీలాధర స్వామి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను కూడా అలరించారు.

ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us