
సినిమా ఇండస్ట్రీలో రీసెంట్ గా ప్రేమలు, పెళ్లిళ్లు, విడాకులు అనేవి చాలా కామన్ అవుతున్నాయి. కొందరు విడాకులతో అభిమానులకు షాక్ ఇస్తుంటే మరికొంతమంది పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని మొదలుపెడుతున్నారు. ఇటీవలే సమంత రెండో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో సమంత పేరు మారుమ్రోగిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో ముద్దుగుమ్మ తన భర్తతో రోజూ గొడవలు అంటూ షాక్ ఇచ్చింది.మూడేళ్లకే జుట్టుపీక్కునే రేంజ్ లో గొడవలు అంటూ అందరిని అవాక్ చేసింది. ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో తెలుసా.? మొన్నామద్యే ఈ అందాల భామ ప్రేమించి పెళ్లి చేసుకుంది. కట్ చేస్తే ఇప్పుడు ఈ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా..?
ఆమె ఎవరో కాదు సోనాక్షి సిన్హా.. బాలీవుడ్ అందాల భామ సోనాక్షి సిన్హా. సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన దబాంగ్ సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత అక్కడ వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది. సౌత్ లోనూ ఓ సినిమా చేసింది ఈ ముద్దుగుమ్మ రజినీకాంత్ హీరోగా నటించిన లింగ సినిమాలో సోనాక్షి హీరోయిన్ గా చేసింది. కాగా సోనాక్షి సిన్హా జహీర్ ఇక్బాల్‌ను వివాహం చేసుకుంది. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ ఆ మధ్య పెళ్లి పీటలు ఎక్కారు
ఇదిలా ఉంటే ఇటీవలే టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది సోనాక్షి సిన్హా.. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ షాకింగ్ కామెంట్స్ చేసింది. ప్రేమలో ఉన్నప్పుడు మొదటి మూడేళ్లు మా మధ్య వివరీతమైన గొడవలు జరిగాయి. జుట్టుపీక్కునే రేంజ్ లో మా మధ్య గొడవలు జరిగాయి.. కానీ విడిపోవాలని అనుకోలేదు.. ఒకరి ఆలోచనలను మరొకరం అర్థం చేసుకోలేకపోయాం. ఆతర్వాత కపుల్స్ థెరపీకి వెళ్ళాం.. అప్పటి నుంచి మా మధ్య గొడవలు తగ్గాయి. ప్రతీది నెగిటివ్ గా చూడకూడదు అని అర్ధమైంది. అలా మేము ప్రేమలో కంటిన్యూ అయ్యాం.. చివరికి పెళ్లి చేసుకున్నాం అని చెప్పుకొచ్చింది సోనాక్షి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి .