Hrithik Roshan: హృతిక్ రోషనా మజాకా.. ఫిట్ నెస్ అంటే ఇది గురు.. ఐదువారాల్లోనే ఇలా
హృతిక్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన ఎప్పుడూ వర్కవుట్‌ను వదిలిపెట్టడు. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఫిట్ నెస్ ను కోల్పోయాడు. కాస్త బొద్దుగా మారిపోయాడు. కానీ ఇప్పుడు తిరిగి తన సిక్స్ ప్యాక్ లుక్ లోకి వచ్చాడు.

బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్టార్ హీరోగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు ఈ హ్యాండ్సమ్ హంక్.. హిందీలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించాడు. ఇక హృతిక్ ఫిట్‌నెస్‌కు చాలా ప్రాధాన్యత ఇస్తాడు. ఆయన ఎప్పుడూ వర్కవుట్‌ను వదిలిపెట్టడు. ఈ మధ్యకాలంలో ఫిట్‌నెస్‌కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో అతడి సిక్స్ ప్యాక్ కనిపించకుండా పోయింది. ఈ మధ్యకాలంలో ఆయన ఫిట్ నెస్ ను కోల్పోయాడు. కాస్త బొద్దుగా మారిపోయాడు. కానీ ఇప్పుడు తిరిగి తన సిక్స్ ప్యాక్ లుక్ లోకి వచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫ్గోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
కేవలం ఐదు వారాల్లోనే తన లుక్ ను మార్చేశాడు హృతిక్. దీనికి అతను తన స్నేహితుడు సబా ఆజాద్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుతం హృతిక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్ట్ అందరినీ ఆకర్షిస్తోంది.
హృతిక్ రోషన్ హిట్లు, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. డ్యాన్స్‌లో హృతిక్ కు సాటిలేరు అనే చెప్పాలి. ఆగస్టు నెలలో హృతిక్ సిక్స్ ప్యాక్ మాయమైంది. అయితే అక్టోబర్ 7 నాటికి మళ్లీ సిక్స్ ప్యాక్ చేశాడు. ఫిట్ నెస్ పై ఫోకస్ పెట్టకపోవడమతొ ఆయన కాస్త ఒళ్ళు చేశాడు. ఇప్పుడు పథ ఫోటో కొత్త ఫోటో అంటూ రెండు ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నాడు.
“ఇది పూర్తి చేయడానికి ఐదు వారాలు పట్టింది. నా శరీరంలోని అన్ని భాగాలకు ధన్యవాదాలు. మీ అందరిపై అభిమానంతో నేను ఎప్పుడు ఫిట్ గా ఉండటానికి ట్రై చేస్తూ ఉంటా.. ఫిట్ నెస్ ఏమోగానీ.. ప్రియమైన వారికి, ముఖ్యమైన పనులకు, పార్టీలకు నో చెప్పడం చాలా కష్టమైన పని. అలాగే రాత్రి 9 గంటలకే పడుకోవడం కూడా కష్టమైన పని. ఒకే ఆలోచన గల పార్ట్నర్ కలిగి ఉండటం చాలామంచి విషయం. ధన్యవాదాలు సబా. క్రిస్ లాంటి మెంటర్ దొరకడం నా అదృష్టం. అందరికీ నా ధన్యవాదాలు’ అని రాసుకొచ్చాడు హృతిక్.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




