Shilpa Shetty: కాస్ట్లీ కారు కొన్న స్టార్ కపుల్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..

|

Aug 01, 2024 | 2:01 PM

బాలయ్య బాబు పక్కడ భలేవాడివి బాసు అనే సినిమా చేసింది శిల్పా. అలాగే నాగార్జునతో ఆజాద్ అనే సినిమా .. అదేవిధంగా వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగర కన్య సినిమాలో నటించింది. వీటిలో వెంకటేష్ సినిమా భారీ హిట్ అయ్యింది. ఆతర్వాత ఈ చిన్నది బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సినిమాలు తగ్గించింది.

Shilpa Shetty: కాస్ట్లీ కారు కొన్న స్టార్ కపుల్.. ధర తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే..
Shilpa Shetty Raj Kundra
Follow us on

బాలీవుడ్ అందాల భామ శిల్పాశెట్టి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే..  బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోల సరసన ఆమె నటించి మెప్పించారు. బాలయ్య బాబు పక్కడ భలేవాడివి బాసు అనే సినిమా చేసింది శిల్పా. అలాగే నాగార్జునతో ఆజాద్ అనే సినిమా .. అదేవిధంగా వెంకటేష్ హీరోగా నటించిన సాహసవీరుడు సాగర కన్య సినిమాలో నటించింది. వీటిలో వెంకటేష్ సినిమా భారీ హిట్ అయ్యింది. ఆతర్వాత ఈ చిన్నది బాలీవుడ్ కు చెక్కేసింది. అక్కడ వరుస సినిమాలతో ఫుల్ బిజీగా మారిపోయింది. ఇక ఇప్పుడు ఈ చిన్నది సినిమాలు తగ్గించింది. ఇటీవలే బాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. ఇదిలా ఉంటే శిల్పాశెట్టి వ్యక్తిగత జీవితంతో ఈ మధ్య వార్తల్లో ఎక్కువగా నిలుస్తోంది. బిట్‌కాయిన్‌ మోసం కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ అధికారులు శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రా చెందిన రూ.97.79 కోట్ల విలువైన ఆస్తులను సీజ్‌ చేశారు.

ఇది కూడా చదవండి : నువ్వొస్తానంటే నేనొద్దంటానా‌లో నటించిన ఈ అమ్మడు గుర్తుందా.? ఇప్పుడు ఎలా ఉందంటే

తాజాగా ఈ జంట ఓ కాస్ట్లీ కారును కొనుగోలు చేశారు. బ్రిటిష్ లగ్జరీ స్పోర్ట్స్ కార్ బ్రాండ్ లోటస్ నుండి రాజ్ కుంద్రా, శిల్పాశెట్టి ఎలెట్రే కారును కొనుగోలు చేశారు. ఈ కారు ధర 3 కోట్ల రూపాయలు. ఈ కారుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ కారు ఢిల్లీ రిజిస్ట్రేషన్ నెంబర్ తో ఉంది. ఈ కారు గరిష్ట వేగం గంటకు 258 కి.మీ. సోషల్ మీడియాలో ఈ కారు ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : Vikramarkudu: విక్రమార్కుడు విలన్ భావుజీ ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా.?

ఏప్రిల్‌లో రాజ్‌కుంద్రా, శిల్పాశెట్టికి చెందిన సుమారు రూ. 97 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం, 2002 కింద అతని ఆస్తులను జప్తు చేశారు. ఇందులో ముంబై, పుణెలోని ఫ్లాట్లతో పాటు పలు ఆస్తులను సీజ్ చేశారు. ఈ కేసుకు 2017లో జరిగిన బిట్‌కాయిన్ మోసానికి లింక్ ఉందని అధికారులు గుర్తించారు..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి