Triptii Dimri: వివాదంలో యానిమల్ బ్యూటీ.. త్రిప్తి దిమ్రీ పై మహిళా వ్యాపారవేత్తలు ఆగ్రహం
రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ తక్కువ సేపే కనిపించింది. కానీ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్స్ సొంతం చేసుకుంది. ఎక్కడ చూసిన ఈ భామ పేరే వినిపించింది. దీంతో సినిమా ఛాన్సులు, యాడ్స్, ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది.
ఒకే ఒక్క సినిమాతో చాలా మంది హీరోయిన్స్ పాపులర్ అవుతూ ఉంటారు. అలా పాపులర్ అయిన వారిలో యానిమల్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ఒకరు. రణబీర్ కపూర్ నటించిన ‘యానిమల్’లో త్రిప్తి దిమ్రీ నటించింది. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో త్రిప్తి దిమ్రీ తక్కువ సేపే కనిపించింది. కానీ తన అందంతో కుర్రకారును ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. దాంతో ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్స్ సొంతం చేసుకుంది. ఎక్కడ చూసిన ఈ భామ పేరే వినిపించింది. దీంతో సినిమా ఛాన్సులు, యాడ్స్, ఈవెంట్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయింది. త్రిప్తి దిమ్రీ పేరు బాలీవుడ్‌తో పాటు ఇతర భాషల్లోనూ పాపులర్ అయ్యింది ఈ అమ్మడు.
ఇది కూడా చదవండి : Devara : దేవరలో నటించిన ఈమె గుర్తుందా.? బయట చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే
‘యానిమల్’ సినిమా తర్వాత త్రిప్తీకి అదృష్టం కలిసొచ్చింది . నేషనల్ క్రష్‌గా తనను తాను నిరూపించుకుంది త్రిప్తి దిమ్రీ,యానిమల్ సినిమా తర్వాత బ్యాడ్ న్యూజ్ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో , విక్కీ కౌశల్ కౌశల్, త్రిప్తి ,అమ్మీ విర్క్ నటించారు. ఈ సినిమా ఇటీవలే విడుదలైంది . ఈ సినిమాలో త్రిప్తి హాట్ లుక్ లో కనిపించి మెప్పించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ అమ్మడు వివాదంలో చిక్కుకుంది. ఓ ఈవెంట్ హాజరవుతానని చెప్పి అడ్వాన్స్ తీసుకుని మోసం చేయడం ఫిలిం సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇది కూడా చదవండి :బాబోయ్..! భరణి సినిమా హీరోయిన్ ఎంత మారిపోయింది.. కుర్రహీరోయిన్స్ కూడా కుళ్ళుకోవాల్సిందే
జైపుర్‌కి చెందిన కొందరు మహిళల వ్యాపారవేత్తలు కలిసి ఎఫ్ఐసీసీఐ ఎఫ్ఎల్ఓ ఆధ్వర్యంలో ఓ ఈవెంట్ ఏర్పాటు చేశారు. అయితే ఈవెంట్ కు త్రిప్తీ ని గెస్ట్ గా ఇన్వైట్ చేశారు. ఇందుకు గాను ఆమె రూ.5.5 లక్షలు కూడా తీసుకుందట. అయితే ఆమె వస్తుందని అన్ని ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆమె హ్యాండ్ ఇచ్చిందట. ఈవెంట్ మొదలయ్యే 5నిమిషాల ముందు వరకు వస్తానని చెప్పిందట త్రిప్తి దిమ్రీ. తీరా రాకపోయేసరికి నిర్వహకులు, మహిళా వ్యాపారవేత్తలు మండిపడ్డారు. త్రిప్తీ పై నిరసన వ్యక్తం చేస్తూ ఫొటోపై నల్లని పెయింట్ రాశారు. అలాగే త్రిప్తీ లీగల్ యాక్షన్ తీసుకుంటామని, జైపుర్‌లో ఆమె సినిమాలని బ్యాన్ చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు మహిళా వ్యాపారవేత్తలు. దేనికి పై త్రిప్తి ఇంతవరకూ స్పందించలేదు. మరి ఆమె ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
ఇది కూడా చదవండి : నాన్న స్టార్ హీరో, అమ్మ సీనియర్ హీరోయిన్.. కానీ ఈ అక్కాచెల్లెళ్లకు మాత్రం ఒక్క హిట్ లేదు
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి