Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు.. ప్రియాంక చోప్రా పై నటి షాకింగ్ కామెంట్స్

ప్రముఖ నటి ప్రియాంక చోప్రా బాలీవుడ్‌కే పరిమితం కాలేదు. ఇప్పుడు హాలీవుడ్‌లో కూడా ఈ ముద్దుగుమ్మ పేరు మార్మోగిపోతోంది. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆమెకు కోట్లాది మంది అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం తన భర్త నిక్ జొనాస్ తో కలిసి అమెరికాలోనే ఉంటోంది ప్రియాంక. గతంలో లాగా బాలీవుడ్ లోనూ ఎక్కువగా సినిమాలు చేయడం లేదు.

దేవుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు.. ప్రియాంక చోప్రా పై నటి షాకింగ్ కామెంట్స్
Priyanka Chopra
Follow us
Rajeev Rayala

|

Updated on: Feb 12, 2025 | 7:46 AM

ప్రియాంక చోప్రా.. ఈ అమ్మడు ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు వెళ్ళింది ఈ అమ్మడు. ప్రియాంక నటించిన ‘సిటాడెల్’ సినిమా రీసెంట్ గా విడుదలైంది. హీరోలతో సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటూ దూసుకుపోతుంది ఈ చిన్నది. ప్రస్తుతం ప్రియాంక సూపర్ స్టార్ మహేష్ బాబు, రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కోసం రెడీ అవుతుంది. అమెరికాలో సెటిల్ అయిన ప్రియాంక ఇటీవలే ఇండియాకు వచ్చింది. గతంలో ప్రియాంక చోప్రా బాలీవుడ్ లో సినిమాలు చేయడం ఆపేస్తాను అంటా ప్రకటించింది. గతంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో రాజకీయాలను ప్రియాంక చోప్రా ఆమధ్య బయటపెట్టింది. బాలీవుడ్ రాజకీయాలతో తాను విసుగు చెందానని, ఆఫర్స్ రావడం కష్టమని ప్రియాంక చెప్పింది. ప్రియాంక చోప్రా బాలీవుడ్‌ను విడిచిపెట్టడానికి ఇదే కారణం అని సి హెప్పింది. ప్రియాంక చోప్రా ఈ విషయాన్ని వెల్లడించిన తర్వాత, షెర్లిన్ చోప్రా ప్రియాంకను విమర్శించింది.

ప్రియాంక చోప్రాకు బాలీవుడ్‌లో ఆఫర్స్ రావడం లేదని చేసిన కామెంట్స్ షెర్లిన్ చోప్రా మాట్లాడుతూ.. ‘ఆమెకు ఆఫర్స్ రావడం లేదని నేను అనుకోను. ప్రియాంక షారుఖ్ ఖాన్, కరణ్ జోహార్, అక్షయ్ కుమార్ వంటి అనేక మంది పెద్ద నటులతో కలిసి పనిచేసింది. అతనికి ఒకరు కాదు, చాలా మంది నిర్మాతలు, దర్శకులు చాలా అవకాశాలు ఇచ్చారు. ప్రియాంక తన కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఈ అవకాశాలన్నింటినీ ఉపయోగించుకుంది, కాబట్టి ఆమె ఈ విషయాలకు బాలీవుడ్‌కు కృతజ్ఞతలు చెప్పాలి’ అని షెర్లిన్ అన్నారు.

షెర్లిన్ చోప్రా అక్కడితో ఆగలేదు. ‘దేవుడు ఆమెకు అన్నీ ఇచ్చాడు, ఆమె అసంతృప్తి చెందడానికి ఎటువంటి కారణం లేదు.’ ఇప్పుడు బాలీవుడ్ ఆమెకు పని ఇవ్వలేదని చెప్పడం తప్పు. ప్రియాంక చాలా మంది పెద్ద నటులతో కలిసి పనిచేసింది అలాగే చాలా గొప్ప చిత్రాలను  చేసింది. నేను అలా చెబితే, ఈ విషయాలు నాకు వర్తిస్తాయి. “ప్రజలు నా మాటలను నమ్మవచ్చు, కానీ ప్రియాంక ఇప్పుడు ఇవన్నీ చెప్పడం సరైనది కాదు” అని షెర్లిన్ అన్నారు. మహేష్ బాబు నటిస్తున్న కొత్త చిత్రానికి రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాపై చాలా అంచనాలు ఉన్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ప్రియాంక ఈ సినిమా కోసం ఇండియాకు తిరిగి వచ్చింది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. ఆఫ్రికన్ అడవుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.