AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bulli Raju: లైలా ప్రమోషన్‌లో బుల్లిరాజు సందడి.. మా నాన్నకు మళ్లీ పెళ్లి అంటూ వీడియో

విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ మూవీ లైలా. విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్న విశ్వక్ సేన్.. ఈసారి లైలాగా ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో లేడీ గెటప్ లో కనిపించనున్నాడు విశ్వక్ సేన్. ఈ సినిమా ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Bulli Raju: లైలా ప్రమోషన్‌లో బుల్లిరాజు సందడి.. మా నాన్నకు మళ్లీ పెళ్లి అంటూ వీడియో
Laila
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2025 | 8:58 AM

Share

యంగ్ హీరో విశ్వక్ సేన్ నటిస్తున్న నయా మూవీ లైలా. హిట్స్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు విశ్వక్ సేన్. రీసెంట్ డేస్ లో గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెకానిక్ రాకీ సినిమాలతో ఆడియెన్స్ ను అలరించాడు. ఇప్పుడు లైలాగా మరోసారి మనల్ని ఎంటర్ టైన్ చేసేందుకు వస్తున్నాడీ యంగ్ హీరో. అన్ని హంగులను పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ప్రమోషన్స్ జెట్ స్పీడ్ తో చేస్తున్నారు. అలాగే ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న లైలా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ సినిమాకు లియోన్ జేమ్స్ స్వరాలు సమకూర్చారు. రీసెంట్ గా లైలా మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ఈ ట్రైలర్ సినిమా పై అంచనాలు పెంచేసింది.

అలాగే ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇటీవలే గ్రాండ్ గా నిర్వహించారు. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి గెస్ట్ గా హాజరయ్యారు. ఈ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి లైలా సినిమా గురించి, హీరో విశ్వక్ సేన్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో ఉన్న విశ్వక్ సేన్ తాజాగా ఓ వెరైటీ ప్రమోషన్ చేశారు. రీసెంట్ డే లో బ్లాక్ బస్టర్ హిట్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో నటించిన బుల్లిరాజుతో ఓ ఫన్నీ వీడియో చేశారు విశ్వక్ సేన్.

రేవంత్ భీమల.. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో బుల్లిరాజుగా నటించి మెప్పించాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ గా  నిలవడమే కాదు కలెక్షన్స్ కూడా భారీగా సాధించింది. అలాగే సినిమాలో బుల్లిరాజు క్యారెక్టర్ సినిమాకే హైలైట్ అయ్యింది. తాజాగా బుల్లిరాజు లైలా కోసం ఓ ఫన్నీ వీడియో చేశారు. ఎవరు ఈ లైలా.? ఎలాగైనా పట్టుకొని మా నాన్నకు ఇచ్చి పెళ్లి చేయాలి అంటూ ఫన్నీగా వీడియో చేశాడు ఈ బుడతడు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు..
ఉదయాన్నే గ్రౌండ్‌లో వింత ఆకారం.. దగ్గరికెళ్లి చూసి పరుగో పరుగు..
పింక్ సాల్ట్ vs తెల్ల ఉప్పు: ఆరోగ్యానికి ఏది మంచిది?
పింక్ సాల్ట్ vs తెల్ల ఉప్పు: ఆరోగ్యానికి ఏది మంచిది?
ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే..
ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే..
ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. బౌలర్లకు ఇక పండగే
ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. బౌలర్లకు ఇక పండగే
అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. శ్రీకాంత్..
అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. శ్రీకాంత్..
గ్యాస్ సిలిండర్ వాడేవారికి లాస్ట్ ఛాన్స్.. ఇది చేయకపోతే..
గ్యాస్ సిలిండర్ వాడేవారికి లాస్ట్ ఛాన్స్.. ఇది చేయకపోతే..
హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడు!
హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడు!
Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి అదృష్టాల వెల్లువ
Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి అదృష్టాల వెల్లువ
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..