
‘ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న’.. ఈ మాటను అక్షరాలా నిజం చేస్తున్నారు చాలా మంది స్టార్ హీరోలు. తాము సంపాదించిన కొంత భాగంలో సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. పేదలకు, అనాథలకు, వృద్ధులకు తమ వంతు విరాళాలు అందిస్తున్నారు. అలా తాజాగా మరో స్టార్ నటుడు తన గొప్ప మనసును చాటుకున్నాడు. ప్రస్తుతం హిందీలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా ప్రాజెక్టు రామయాణ లో ఓ కీలక పాత్ర పోషిస్తోన్న ఈ నటుడు తన రెమ్యునరేషన్ మొత్తాన్ని ఓ మంచి పని కోసం ఉపయోగిస్తానని ప్రకటించాడు. దీంతో సదరు నటుడిపై ప్రశంసల జల్లు కురుస్తోంది. దంగల్ ఫేమ్ నితేశ్ తీవారీ తెరకెక్కిస్తోన్న రామయాణ్ లో రణ్ బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్నారు. కన్నడ స్టార్ హీరో యశ్ రావణుడిగా కనిపించననున్నాడు. ఇదే సినిమాలో రక్త చరిత్ర ఫేమ్, బాలీవుడ్ నటుడు వివేక్ ఓబెరాయ్ విభీషణుడిగా యాక్ట్ చేస్తున్నాడు. మొత్తం రూ. 4000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. మొత్తం రెండు పార్టులుగా ఈ సినిమా రిలీజ్ కానుంది. వచ్చే ఏడాది రామాయణ్ మొదటి భాగం రిలీజ్ కానుండగా, 2027లో రెండో భాగం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ ఓబెరాయ్ రామాయణ్ సినిమాకు గానూ తనకు వచ్చే రెమ్యునరేషన్ ను క్యాన్సర్ బాధితులకు విరాళంగా ఇవ్వనున్నట్లు వెల్లడించాడు.
‘నా జీవితంలో ఏ పని చేసినా పూర్తి ప్రేమతోనే చేస్తాను. రామాయణ్ సినిమాకు గానూ నాకు వచ్చే పారితోషికాన్ని క్యాన్సర్‌తో పోరాడుతున్న పిల్లల సహాయార్థం విరాళంగా ఇవ్వాలనుకుంటున్నా. ఈ విషయాన్ని నిర్మాత నమిక్‌కు కూడా చెప్పాను. ఆయన కూడా నాకు మద్దతుగా నిలుస్తామని హామీ ఇచ్చారు. నాకు ఒక్క పైసా కూడా వద్దు. నేను బలంగా నమ్మే ఒక మంచి కారణం కోసం ముఖ్యంగా పిల్లల వైద్యం కోసం ఈ మొత్తాన్ని వినియోగించాలనుకుంటున్నాను’ అని వివేక్ ఒబెరాయ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ నటుడి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినీ అభిమానులు, నెటిజన్లు వివేక్ ఓబెరాయ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. కాగా రక్త చరిత్ర, వినయ విధేయరామ సినిమాలతో ఈ నటుడు తెలుగు వారికి కూడా బాగా దగ్గరైపోయాడు.
“I told Namit (Malhotra) that I don’t want a penny for this. I want to donate it to a cause I believe in: helping kids with cancer,”
– #VivekOberoi | #RamayanaPart1
For the unversed, the actor will be seen playing the role of Vibhishan in Ramayana: Part 1. pic.twitter.com/u7JmWEvh24
— MOHIT_R.C (@Mohit_RC_91) October 28, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.