Saif Alikhan : ఆటో డ్రైవర్‏కు కృతజ్ఞతలు చెప్పిన సైఫ్.. భజన్‌సింగ్‌కు అన్నివిధాలా అండగా ఉంటానంటూ..

|

Jan 22, 2025 | 7:51 PM

ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ నిన్న డిశ్చార్జ్ అయిన సంగతి తెలిసిందే. సైఫ్ పూర్తిగా కోలుకోవడానికి ఇంకా నెల రోజుల సమయం పడుతుందని.. అప్పటివరకు షూటింగ్స్ మానుకోవాలని సూచించారు వైద్యులు. ముంబై లోని బాంద్రాలో తన నివాసంలో కత్తిపోట్లకు గురైన బాలీవుడ్‌ నటుడు సైఫ్‌ అలీఖాన్‌ ఆటో డ్రైవర్‌ భజన్‌సింగ్‌ను కలిశాడు..

Saif Alikhan : ఆటో డ్రైవర్‏కు కృతజ్ఞతలు చెప్పిన సైఫ్.. భజన్‌సింగ్‌కు అన్నివిధాలా అండగా ఉంటానంటూ..
Saif Alikhan
Follow us on

బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ పై గుర్తుతెలియని వ్యక్తి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. జనవరి 16 నుంచి ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు సైఫ్ ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగుపడడంతో అతడిని డిశ్చార్జ్ చేశారు వైద్యులు. అలాగే సైఫ్ పూర్తిగా ఒక నెల రోజులు బెడ్ రెస్ట్ తీసుకోవాలని… బరువు ఎత్తడం, జిమ్ చేయడం కుదరదని సూచించినట్లు తెలుస్తోంది. మంగళవారం ఆయన ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. సైఫ్ ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకున్నప్పుడు మీడియా ముందుకు వచ్చారు. సైఫ్‌పై దాడి జరిగిన ఘటనలో పోలీసుల విచారణలో చాలా విషయాలు వెల్లడయ్యాయి.

అయితే సైఫ్ దాడి ఘటనలో రియల్ హీరోగా మారాడు ఆటో డ్రైవర్ భజరంగ్ సింగ్. కత్తి దాడిలో తీవ్రగాయాల పాలైన సైఫ్‌ను భజన్‌సింగ్‌ తన ఆటోలో లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. తాజాగా ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత ఆటో డ్రైవర్ ను స్వయంగా కలిశాడు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన భజన్‌సింగ్‌కు ధన్యవాదాలు తెలిపాడు సైఫ్‌. భజన్‌సింగ్‌కు ఏ కష్టం వచ్చినా తనను కలవవచ్చన్నాడు సైఫ్ . అన్ని విధాలా ఆదుకుంటానని భరోసా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ కూడా వైరల్ అయ్యాయి. సైఫ్ డ్రైవర్ పక్కన కూర్చొని భుజంపై చేయి వేసుకుని ఫోటోలు దిగారు.

ఆటో డ్రైవర్ భజన్ సింగ్ రాణా మాట్లాడుతూ” నాకు సైఫ్ పీఏ నుంచి రెండు కాల్స్ వచ్చాయి. అతను నన్ను కలవమని ఆహ్వానించాడు. సైఫ్ అప్పుడు ఆసుపత్రిలో ఉన్నాడు. నేను వెళ్ళిన తరువాత, నేను మొదట అతని పాదాలపై పడ్డాను. అతని కుటుంబం మొత్తం అక్కడ ఉంది. ఆయన తల్లి షర్మిలా ఠాగూర్ కూడా అక్కడే ఉన్నారు, నేను కూడా ఆమె కాళ్లపై పడ్డాను. అందరూ నాకు కృతజ్ఞతలు తెలిపారు. సైఫ్ తల్లి కృతజ్ఞతలు తెలిపింది. కానీ సైఫ్ కోలుకున్నందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను” అంటూ చెప్పుకొచ్చారు.

ఇది చదవండి :  Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..

Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..

Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?

Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..