Rajpal Yadav: తిహాడ్ జైలులో ఫేమస్ కమెడియన్.. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన స్టార్ సెలబ్రిటీలు

ప్రముఖ సీనియర్ నటుడు రాజ్‌పాల్ యాదవ్ 27 సంవత్సరాలుగా బాలీవుడ్‌ సినిమా ఇండస్ట్రీలో పనిచేస్తున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించారాయన. తెలుగులోనూ రవితేజ కిక్-2 సినిమాలో ఓ కీలక పాత్రలో మెరిశాడీ సీనియర్ యాక్టర్.

Rajpal Yadav: తిహాడ్ జైలులో ఫేమస్ కమెడియన్.. సాయం చేసేందుకు ముందుకు వచ్చిన స్టార్ సెలబ్రిటీలు
Bollywood actor Rajpal Yadav

Updated on: Feb 12, 2026 | 8:55 AM

బాలీవుడ్ ప్రముఖ హాస్యనటుడు రాజ్‌పాల్ యాదవ్ 2010 నాటి పాత లోన్, చెక్ బౌన్స్ కేసులో దోషిగా తేలాడు. చాలా సంవత్సరాలుగా సాగుతున్న ఈ కేసులో కోర్టు ఇటీవలే తీర్పునిచ్చింది. రాజ్ పాల్ యాదవ్ ను దోషిగా నిర్ధారించింది. తనకు మరికొంత సమయం కావాలని చేసిన విజ్ఞప్తిని ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో ఆయన తిహాడ్‌ జైలులో లొంగిపోయాడు. తన ఆర్థిక ఇబ్బందుల గురించి జైలు అధికారులతో ఆయన పంచుకున్న ఆయన తనకు లొంగిపోవడం తప్ప మరో అవకాశం లేదన్నారు. రాజ్‌పాల్ యాదవ్ 27 సంవత్సరాలుగా బాలీవుడ్‌లో పనిచేస్తున్నారు. తన కామెడీతో దేశంలోని అత్యుత్తమ హాస్యనటులలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ కారణంగా, ఇప్పుడు చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది రాజ్‌పాల్ యాదవ్‌కు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఇటీవల నటుడు సోను సూద్ ట్వీట్ చేసి రాజ్ పాల్ కు సాయం చేయాలని పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.. ‘చిత్ర పరిశ్రమ రాజ్‌పాల్ యాదవ్‌కు సహాయం చేయాలి, వారు అతనితో ఒక సినిమాపై సంతకం చేసినా, వారు అతనికి ముందుగానే డబ్బు ఇవ్వాలి, నేను కూడా అదే చేస్తున్నాను. ఇది అతని సమస్యను పరిష్కరిస్తుంది’ అని సోనూ పేర్కొన్నాడు.

సోనూ ట్వీట్ తో సినీ ప్రముఖులు కదిలారు. రాజ్ పాల్ యాదవ్ కు సహాయం చేసేందుకు ఒక్కొక్కరు ముందుకు వస్తున్నారు. ఇప్పుడు, ప్రముఖ సంగీత దర్శకుడు రావు ఇందర్‌జిత్ సింగ్ రాజ్‌పాల్ యాదవ్‌కు సహాయం చేసి రూ.1.11 కోట్లు ఇచ్చారు. ‘భూల్ భూలయ్య’, ‘హంగామా’, ‘వెల్‌కమ్’ వంటి అనేక హిందీ చిత్రాలకు సంగీతం అందించిన రావు ఇందర్‌జిత్ సింగ్ రాజ్‌పాల్ యాదవ్‌కు ఆపన్న హస్తం ఇచ్చారు. ‘రాజ్‌పాల్ యాదవ్ కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీకి సేవలు అందిస్తున్నారు. ఆయన సినీ ప్రేమికులకు ఎన్నో చిరస్మరణీయమైన, సంతోషకరమైన క్షణాలను అందించారు. ఆయన భారతీయ సినిమా పరిశ్రమలో అంతర్భాగం కూడా. ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు. కష్టాల్లో ఉన్న వ్యక్తికి, ముఖ్యంగా చిత్రనిర్మాతకు అండగా నిలబడటం మన కర్తవ్యం కాబట్టి అందుకే ఈ చిన్న సహాయం చేశాను’ అని రావు ఇందర్‌జిత్ సింగ్ చెప్పుకొచ్చారు. ఇక వివాదాస్పద సినీ విమర్శకుడు కమల్ ఆర్ ఖాన్ కూడా రాజ్‌పాల్ యాదవ్‌కు రూ.10 లక్షలతో సహాయం చేస్తానని చెప్పారు. కొన్ని నివేదికల ప్రకారం, కొంతమంది సినీ ప్రముఖులు రాజ్‌పాల్ యాదవ్‌కు డబ్బు ఇచ్చారని కూడా చెబుతున్నారు.

 

ఇవి కూడా చదవండి

కాగా రాజ్‌పాల్ యాదవ్ రూ.9 కోట్ల చెక్ బౌన్స్ కేసులో జైలులో ఉన్నాడు. రూ.9 కోట్లు చెల్లిస్తే అతను జైలు నుంచి విడుదల కావచ్చు.

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.