AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఎంత పని చేశావ్ భయ్యా..!! హీరోయిన్ విషయంలో రాజా సాబ్‌పై మరోసారి ట్రోల్స్..

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన రాజా సాబ్ సినిమా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పై విడుదలకు ముందు భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమా హారర్ కామెడీ కావడంతో సినిమా ఆపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఎంత పని చేశావ్ భయ్యా..!! హీరోయిన్ విషయంలో రాజా సాబ్‌పై మరోసారి ట్రోల్స్..
Malavika Mohan
Rajeev Rayala
|

Updated on: Feb 12, 2026 | 8:52 AM

Share

ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజా సాబ్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా పై భారీ బజ్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా ప్రభాస్ లుక్స్ అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. గత కొన్నేళ్లుగా యాక్షన్ సినిమాలతో మెప్పిస్తున్న ప్రభాస్ ను వింటేజ్ లుక్ తో పాటు ఎంటర్టైన్మెంట్ యాంగిల్ లో చూసి ప్రేక్షకులు ఫుల్ ఖుష్ అయ్యారు. జనవరి 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కాగా ఈ సినిమా విడుదల తర్వాత మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా మారుతి చెప్పిన రేంజ్ లో సినిమా లేకపోవడంతో అభిమానులు నిరాశపడ్డారు. చాలా మంది ఈ సినిమా పై విమర్శలు కురిపించారు. ఇదిలా ఉంటే ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం భారీగానే రాబట్టిందని తెలుస్తుంది.

ఆ ఇద్దరు హీరోలు నాతో చాలా ఫ్రెండ్లిగా ఉంటారు.. ఆసక్తికర విషయం చెప్పిన టాలీవుడ్ విలన్

ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. కాగా రాజా సాబ్ సినిమా పై ఇప్పటికే ప్రభాస్ ఫ్యాన్స్ , నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే దర్శకుడు మారుతికి చుక్కలు చూపించారు డార్లింగ్ ఫాన్స్. ఇప్పటికే నెటిజన్స్ సినిమాలో మైనస్ లు వెతికి పట్టుకొని ట్రోల్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభాస్ కు బాడీ డబుల్ ను వాడారని, అలాగే కొన్ని సీజీ షాట్స్ బాలేవని  కూడా ట్రోల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు రాజా సాబ్ కు సంబందించిన ఓ ఫోటో తెగ చక్కర్లు కొడుతుంది.

అచ్చం మామ పొలికే.. ఉదయ్ కిరణ్ మేనకోడలు ఇప్పుడు ఎలా ఉందొ చూశారా..

రాజా సాబ్ సినిమాలు విలన్ గ్యాంగ్‌లో నటించిన రోన్సన్ విన్సెంట్ అనే నటుడు.. తాజాగా ‘రాజాసాబ్’ గురించి ఇన్ స్టాలో పోస్ట్ పెట్టాడు. ఇందులో మాళవికకి కూడా డూప్ ఉందనే సంగతి బయటపెట్టాడు. దాంతో మరోసారి ట్రోలర్స్ రెచ్చిపోయారు. హీరోయిన్ మాళవికాను డూప్ గా నటించిన అమ్మాయితో దిగిన ఫోటోను పంచుకున్నాడు రోన్సన్ విన్సెంట్ దాంతో చివరకు హీరోయిన్ కూడా డూపే నా అంటూ దర్శకుడు మారుతి పై విమర్శలు చేస్తున్నారు. ఎవర్రా నువ్వు.? “అయినా కూడా వదల్లేదు రా..” అంటూ కామెంట్స్ చేశారు. ట్రోలింగ్ ఎక్కువకావడంతో ఆ పోస్ట్ ను డిలీట్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ముట్టుకుంటే కందిపోతుందేమో..! మహేష్ బాబు ఫ్యామిలీ నుంచి హీరోయిన్ ఎంట్రీ.?

Raja Saab

Raja Saab

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.