Amala Akkineni: బ్లూక్రాస్ సంస్థ పై వస్తున్న వార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన చైర్ పర్సన్ అమల..

గత కొన్ని రోజులుగా బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సంస్థపై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని ఆ సంస్థ చైర్ పర్సన్ అమల ఖండించారు..

Amala Akkineni: బ్లూక్రాస్ సంస్థ పై వస్తున్న వార్తలు అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన చైర్ పర్సన్ అమల..
Amala

Edited By:

Updated on: Jul 30, 2021 | 3:28 PM

గత కొన్ని రోజులుగా బ్లూ క్రాస్ ఆఫ్ హైదరాబాద్ సంస్థపై వస్తున్న వార్తలన్ని అవాస్తవమని ఆ సంస్థ చైర్ పర్సన్ అమల ఖండించారు.. ఈ మేరకు తన ట్విట్టర్ వేదికగా.. క్లారిటీ ఇచ్చారు. బ్లూక్రాస్ సంస్థ ఆధ్వర్యంలో నగరంలోని కుక్కలకు పిల్లలు పుట్టకుండా ఏబీసీ  (యానిమల్‌ బర్త్‌ కంట్రోల్‌) సర్జరీ చేస్తున్నారని.. ఆపరేషన్ చేసిన అనంతరం అవి కోలుకునే వరకు సంరక్షణ కల్పించకుండా.. అలాగే రోడ్లపై వదిలిపెడుతున్నారని సేవ్ అనిమల్ ఇండియా అనే సంస్థ సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ బ్లూ క్రాస్, అమలపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. దీనిపై స్పందించిన బ్లూక్రాస్ సంస్థ చైర్ పర్సన్ అమల వివరణ ఇచ్చారు. వీధి కుక్కల పట్ల బ్లూ క్రాస్ అమానుషంగా ప్రవర్తిస్తోందన్న సేవ్ అనిమల్ ఇండియా ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదన్నారు. సోషల్ మీడియా వేదికగా బ్రూ క్రాస్ సంస్థపై ఇలాంటి  దుష్ప్రచారం కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. జీహెచ్ఎంసీ అధికారుల నిబంధనల మేరకే మూగ జీవాల రక్షణ కల్పిస్తున్నామని చెప్పారు. ఏబీసీ ఆపరేషన్ తర్వాత నాలుగు రోజులు ఇంటెన్సివ్ కేర్‏లో ఉన్న తర్వాతే వీధి కుక్కలను..వాటి స్వస్థలాల్లో వదిలిపెడుతున్నామని అమల క్లారిటీ ఇచ్చారు.

ట్వీట్..

గత కొంతకాలంగా హైదరాబాద్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో వీధికుక్కల సంఖ్యను తగ్గించేందుకు ఆ శునకాలకు సదరు వైద్య సిబ్బంది ఆపరేషన్‌ చేసి అలాగే వదిలి పెడుతున్నారని.. ఆపరేషన్‌ తర్వాత చేయాల్సిన చికిత్స చేయకుండానే రోడ్లపైనే వదిలి పెడుతున్నారని సోషల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే.. అలాంటి శునకాల ఫొటోలను వివరాలతో సహా సేవ్‌ యానిమల్స్‌ఇండియా అనే ట్విటర్‌ ఖాతా ద్వారా ఓ నెటిజన్‌ కొంతకాలంగా ట్విటర్‌లో పోస్టు చేస్తూ వస్తున్నారు. ఇలా దాదాపు 2,122 శునకాలను ఆపరేషన్‌ చేసి ఇలాగే నిర్దాక్షిణ్యంగా రోడ్డుపై వదిలేశారని ట్వీట్‌లో పేర్కొన్నారు. పై అధికారులు తమకు విధించిన రోజువారీ టార్గెట్‌ రీచ్ కావడం కోసం వైద్య సిబ్బంది ఇలా శునకాలను హింసించడం సరికాదని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: Ariyana Glory : ఈ ముద్దుగుమ్మ మేకప్ కోసం ఇంతమంది కావాలా.. షాకిస్తోన్న అరియనా వీడియో

Thimmarusu Review: తిమ్మరుసు తెలివితేటలు… థియేటర్లో గెలిపిస్తాయా?

Divi Vadthya : ‘దివి’నుంచి జాలువారిన అందాల జలపాతంలా.. కవ్విస్తోన్న బిగ్ బాస్ బ్యూటీ ఫోటోలు..