Bigg Boss Telugu 7: అమర్ దీప్‌ను టార్గెట్ చేసి కూల్చేశారు..

ఇక ఈ వారం శోభ, గౌతమ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. శోభ లాస్ట్ ప్లేసులో ఉండగా, గౌతమ్ ఆమె పై స్థానంలో ఉన్నాడు. ఈ వారం స్టార్ మా బ్యాచ్ నుంచి ఒకరు వెళ్లిపోయే చాన్సులు కనిపిస్తున్నాయి. అటు గౌతమ్‌కు కూడా ఈవారం స్క్రీన్ స్పేస్ సరిగ్గా దొరకలేదు. సో అతడి ఫ్యాన్స్‌ కూడా అలెర్టై ఓట్లు వేస్తేనే సేవ్ అవుతాడు.

Bigg Boss Telugu 7: అమర్ దీప్‌ను టార్గెట్ చేసి కూల్చేశారు..
Bigg Boss Telugu

Updated on: Nov 17, 2023 | 6:18 PM

బిగ్ బాస్ అంటేనే అదో కిక్కు. గొడవలు, గ్రూపులు, లవ్వులు, ఫ్రెండ్షిప్పులు, ద్వేషాలు, నాగార్జున క్లాసులు. ఉల్టా, పుల్టా సీజన్ సైతం మస్త్ ఉపుగా సాగుతుంది.  ప్రస్తుతం హౌస్ లో ఉన్నది శివాజీ, గౌతమ్, యావర్, ప్రశాంత్, ప్రియాంక జైన్, శోభా శెట్టి, అమర్ దీప్,  అర్జున్ అంబటి, అశ్విని శ్రీ, రతికా రోజ్ ఉన్నారు. ఇక వీరిలో ఎవరు టాప్ 5కి వెళ్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక మరో నాలుగు వారాల్లో ఈ సీజన్ ముగియనుంది. దీంతో కాంపిటీషన్ పెరిగింది. స్పై టీమ్.. శివాజీ, ప్రశాంత్, యావర్.. టాప్ 3 ఉంటారనిపిస్తోంది. మిగతా ఇద్దరు ఎవరు అనేది ఇప్పుడు పెద్ద సస్పెన్స్. అమర్ దీప్‌కు కూడా టాప్ 5 లో ఉండే ఛాన్స్ ఉంది. ప్రియాంక, అర్జున్‌లలో ఒకరు టాప్ 5లోకి రావొచ్చు.

ఇక  బిగ్ బాస్ ఇంట్లో కెప్టెన్ అవ్వడానికి కూడా ఎన్నో టాస్కులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. తాాజాగా కెప్టెన్సీ చివరి టాస్కులో అర్జున్, అమర్ దీప్, పల్లవి ప్రశాంత్, ప్రియాంక… చివరి స్టేజ్‌కు వచ్చారు. వారు తమ వద్ద ఉన్న ఇటుకలతో.. టవర్ కట్టాల్సి ఉంటుంది. కంటెండర్స్‌లో ఎవరు కెప్టెన్ అవ్వకూడదు అనుకుంటారో.. వారి వంతెనను మిగిలిన వాళ్లు బాల్స్‌తో కొట్టాలని టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ రసవత్తరంగా సాగినట్లు తాజా ప్రొమోను బట్టి తెలుస్తుంది. పల్లవి ప్రశాంత్, అర్జున్.. వరస రౌండ్స్‌లో ఔట్ అవ్వగా.. చివరకు అమర్ దీప్, ప్రియాంక మిగిలారు. అయితే హౌస్ అంతా ప్రియాంకను కెప్టెన్ చేయాలని ఫిక్స్ అయినట్లున్నారు. చాలామంది అమర్ వంతెననే టార్గెట్ చేశారు. అయితే ఈ వీక్ కెప్టెన్‌గా ప్రియాంక గెలిచినట్లు లైవ్ చూసినవాళ్ల ద్వారా తెలిసింది.

ఈ వారం డేంజర్ జోన్‌లో శోభ

ఇక ఈ వారం శోభ, గౌతమ్ డేంజర్ జోన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. శోభ లాస్ట్ ప్లేసులో ఉండగా, గౌతమ్ ఆమె పై స్థానంలో ఉన్నాడు. ఈ వారం స్టార్ మా బ్యాచ్ నుంచి ఒకరు వెళ్లిపోయే చాన్సులు కనిపిస్తున్నాయి. అటు గౌతమ్‌కు కూడా ఈవారం స్క్రీన్ స్పేస్ సరిగ్గా దొరకలేదు. సో అతడి ఫ్యాన్స్‌ కూడా అలర్టై ఓట్లు వేస్తేనే సేవ్ అవుతాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.