Pooja Ramachandran: తల్లి కాబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. బీచ్‌లో బేబీ బంప్‌ ఫొటోస్‌ వైరల్‌

|

Dec 27, 2022 | 8:08 AM

పూజా రామచంద్రన్‌.. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ స్వామిరారా సినిమాలో హీరో నిఖిల్‌ పక్కన ఉంటూ తన తెలివితేటలతో అందరినీ బురిడి కొట్టించే అమ్మాయంటే ఠక్కున గుర్తుపడతారు. ఆ సినిమాలో కర్లీ హెయిర్‌తో క్యూట్‌గా కనిపించి కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టిందీ బ్యూటీ.

Pooja Ramachandran: తల్లి కాబోతున్న బిగ్‌బాస్‌ బ్యూటీ.. బీచ్‌లో బేబీ బంప్‌ ఫొటోస్‌ వైరల్‌
Pooja Ramachandran, John Kokken
Follow us on

పూజా రామచంద్రన్‌.. ఈ పేరు చాలామందికి తెలియకపోవచ్చు కానీ స్వామిరారా సినిమాలో హీరో నిఖిల్‌ పక్కన ఉంటూ తన తెలివితేటలతో అందరినీ బురిడి కొట్టించే అమ్మాయంటే ఠక్కున గుర్తుపడతారు. ఆ సినిమాలో కర్లీ హెయిర్‌తో క్యూట్‌గా కనిపించి కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు పెట్టిందీ బ్యూటీ. ఆ తర్వాత ప్రముఖ రియాలిటీ షో బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2లోనూ సందడి చేసి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇలా వెండితెర, బుల్లితెరపై రాణిస్తోన్న పూజా రామచంద్రన్‌ శుభవార్త చెప్పింది. తాను తల్లికాబోతున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా తెలిపింది. ఫొటోల్లో ఆమె బేబీ బంప్‌ని చూపిస్తూ, తాను గర్భవతినయ్యానంటూ పేర్కొంది. బేబీ రాబోతోందనీ, బిడ్డ కోసం తాను ఎదురుచూస్తున్నానని తెలిపింది పూజ. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. మెహరీన్‌ లాంటి సినిమా తారలతో సహా పలువురు బుల్లితెర నటులు పూజా దంపతులకు శుభాకాంక్షలు, అభినందనలు తెలుపుతున్నారు.

విలన్ తో కలిసి రెండో పెళ్లి..

పూజా మొదట 2010లో విజె క్రెయిగ్‌ అనే వ్యక్తిని పెళ్లాడింది. అయితే ఆ బంధం ఎక్కువ కాలం నిలవలేదు. ఇద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారు. ఆతర్వాత తెలుగు, తమిళ సినిమాల్లో విలన్‌గా కనిపించిన జాన్ కొక్కెన్ పెళ్ళాడింది పూజ.  జాన్‌కు కూడా ఇది రెండో వివాహం. 2019లో వీరి పెళ్లి జరగ్గా త్వరలోనే తల్లిదండ్రులుగా ప్రమోషన్‌ పొందనున్నారు.

ఇవి కూడా చదవండి

మోడల్ గా మొదలై..

ఇక పూజ విషయానికొస్తే.. బెంగళూరుకు చెందిన ఆమె మోడల్‌గా కెరీర్‌ ప్రారంభించింది. మిస్‌ కోయంబత్తూర్‌ టైటిల్‌ను గెల్చుకోవడంతో పాటు మిస్‌ కేరళ 2005 రన్నరప్‌గా నిలిచింది. ఆతర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. అలాగే సిద్ధార్థ, అమలాపాల్‌ జంటగా నటించిన లవ్‌ఫెయిల్యూర్‌ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. స్వామిరారా సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆతర్వాత కాంచన2, దోచేయ్‌, త్రిపుర, దళం, ఇంతలో ఎన్నెన్ని వింతలో, కృష్ణార్జున యుద్ధం, వెంకీమామ, ఎంత మంచివాడవురా, అంధకారం, పవర్‌ ప్లే తదితర సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక బుల్లితెర ప్రేక్షకుల అభిమానం చూరగొన్న బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌2లోకి వైల్డ్‌కార్ట్‌ కంటెస్టెంట్‌గా అడుగుపెట్టి ఆకట్టుకుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..