బిగ్ బాస్ సీజన్ 6 మొదట్లో అంత ఆసక్తిగా సాగలేదు కానీ చివరి దశకు వచ్చేసరికి మాత్రం అంతా మారిపోయింది. ఇప్పుడు బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ ఎవరు అవుతారని అందరిలో ఆసక్తి మొదలైంది. టాప్ 5లో ఎవరుంటారు. ? టైటిల్ ఎవరు గెలుచుకుంటారు.? అనేదాని పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉంటే చివరి వారం నామినేషన్స్ ప్రక్రియ జరుగుతోంది. ఇక బుధవారం జరిగిన ఎపిసోడ్ లో.. విన్నర్ ప్రైజ్ మనీ 41, 10, 100 ఉండగానే మరో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. మరోసారి ఏకాభిప్రాయం అంటూ హౌస్ మేట్స్ ను ఇచ్చాడు. హౌస్ మేట్స్ ఏకాభిప్రాయంతో ఇద్దర్ని సెలెక్ట్ చేసుకోవాలని చెప్పాడు. దాంతో హౌస్ లో ఉన్నవాళ్లు రోహిత్, ఆదిరెడ్డిలను ఎంచుకున్నారు.
ఇక ఈ ఇద్దరికీ మేజ్ బోర్డ్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో ఇద్దరు గట్టిగా పోటీపడ్డారు. కానీ ఫైనల్ గా ఆదిరెడ్డి విన్ అయ్యాడు. అయితే మిగిలిన సభ్యులు ఎవరికీ మద్దతు తెలుపుతారో వారి వైపు నిలబడాలని బిగ్ బాస్ చెప్పగా.. శ్రీసత్య తప్ప మిగిలిన వాళ్లంతా ఆదిరెడ్డికే మద్దతు తెలిపారు. రేవంత్, ఇనయ, కీర్తి, శ్రీహాన్‌లు ఆదిరెడ్డి మద్దతు లభించడంతో.. ఆ నలుగురికి కేటాయించిన మొత్తం 80,000 లను విన్నర్ ప్రైజ్ మనీలో యాడ్ చేశారు.
ఆ తర్వాత మరో ఛాలెంజ్ ఇచ్చాడు బిగ్ బాస్. ఈ ఛాలెంజ్‌లో కీర్తి, శ్రీహాన్‌లను ఏకాభిప్రాయంతో ఎంపిక చేసుకున్నారు హౌస్ మేట్స్. వాల్ బ్రేక్ టాస్క్‌లో శ్రీహాన్ గెలుచుకున్నాడు. విన్నర్ ప్రైజ్ మనీ 2,00, 000 లక్షలు యాడ్ అయ్యింది.
ఇంటి సభ్యులు.. మూకుమ్మడిగా శ్రీహాన్ గెలుస్తాడని గెస్ చేశారు. వాళ్ల గెస్ కరెక్ట్ అయ్యి.. శ్రీహాన్ గెలవడంతో విన్నర్ ప్రైజ్ మనీ 43, 90, 100కి పెరిగింది. బిగ్ బాస్.. ఆదిరెడ్డి, శ్రీహాన్‌లను భయపెట్టే ప్రయత్నం చేశాడు. డార్క్ రూంలో మొదటిగా ఆదిరెడ్డి పిలిచి.. అందులో ఎముకలు, దెయ్యాలు, పాములతో రకరకాల సౌండ్‌లు చేసి భయపెట్టేశారు. ‘లోపలికి రండి ఆదిరెడ్డీ’ అని బిగ్ బాస్ అంటే.. ‘యాడకి బిగ్ బాస్ వచ్చేది’ అంటూ కామెడీ చేశాడు.బిగ్ బాస్ సౌండ్స్ ఓకే కానీ.. కాళ్లు చేతులు కానీ పట్టుకుని లాగొద్దు.. నా చేతిలో కట్టె ఉంది కొట్టిపడేస్తా.. అసలు నాకు ఇన్సూరెన్స్ కూడా లేదు.. చచ్చిపోతే నా శవాన్ని మోసుకుని పొండి’ అంటూ భయపడ్డాడు ఆదిరెడ్డి.