బిగ్ బాస్ హౌస్ లో లవ్ ట్రాక్ లు కొత్తేమీ కాదు. ఇప్పటికే చాలా మంది హౌస్ లో లవ్ అంటూ ఎంటర్టైన్ చేశారు. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మాత్రం ఏం సంబంధం లేదు అన్నటుగా వ్యవహరిస్తూ ఉంటారు. అదే హౌస్ లో మాత్రం రాసుకుపూసుకు తిరుగుతూ.. నిజంగానే వీళ్ల మధ్య సంథింగ్ సంథింగ్ అనుకునేలా చేస్తారు. ఈ సీజన్ లో కూడా అదే జరుగుతోంది. హౌస్ లో ఉన్న వాళ్ల మధ్య లింకులు పెడుతూ ప్రేక్షకులకు లేనిపోని డౌట్స్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక ఈ సీజన్ లో బిగ్ బాస్ కామెడీ కూడా చేస్తున్నాడు. నిన్నటి ఎపిసోడ్ లో బిగ్ బాస్ పుట్టిన రోజు అంటూ ఏవేవో టాస్క్ లు ఇచ్చాడు. బిగ్ బాస్ బర్త్ డే అంటూ హౌస్ మేట్స్‌కి ఓ కేకు ముక్క పంపాడు. దాన్ని తినాలంటే ఎంటర్ టైన్ చేయాలని కోరాడు. దాంతో హౌస్ మేట్స్ తమ టాలెంట్ ను బయట పెట్టడానికి ట్రై చేశారు.
వీరిలో శ్రీ హాన్ సత్య రొమాన్స్ హైలైట్ అనే చెప్పాలి. ఇద్దరు కలిసి ఓ లవ్లీ సాంగ్ కు రెచ్చిపోయి డ్యాన్స్ చేశారు. ఆకట్టుకునే మూమెంట్స్ తో శ్రీ హాన్ శ్రీ సత్య డాన్స్ చేస్తుంటే అర్జున్ కళ్యాణ్ కడుపు రగిలిపోయింది. ఇక వీరి డ్యాన్స్ కు రేవంత్ అద్భుతంగా సాంగ్ పాడాడు. ఆ తర్వాత కెప్టెన్ కీర్తి వచ్చి రాని తెలుగులో ఓ బ్యూటీ ఫుల్ సాంగ్ పాడింది. ఇక ఆమె పాడిన పాటనే కంటిన్యూ చేసింది గీతూ.. తన గొంతు బాగోదు అంటూనే పాటను బాగానే పాడింది. సూర్య తన మిమిక్రీ తో ఆకట్టుకున్నాడు.
ఇక బిగ్ బాస్ గీతూ కి ఓ వింతం టాస్క్ ఇచ్చాడు. పలికి పిలిచి.. ఆమెకు చికెన్, కూల్ డ్రింక్ ఇచ్చి.. ఇంట్లో వాళ్లపై గాసిప్‌లు చెప్పాలని కోరాడు. దాంతో రెచ్చిపోయి మరి ఓ గాసిప్ పుట్టించింది గీతూ.. సూర్య, ఇనయల మధ్య ఏదో నడుస్తోంది బిగ్ బాస్ అంటూ చెప్పుకొచ్చింది. సూర్య నార్మల్‌గానే ఉన్నాడు కానీ.. ఇనయ మాత్రం ఏదో రగులుతోంది మొగలి పొద అన్నట్టుగా కనిపిస్తోంది బిగ్ బాస్. ఇక సత్యని అయితే భయంకరంగా గోకేయడానికి అర్జున్ ట్రై చేస్తున్నాడు. హౌస్‌లోకంటిన్యూ అవ్వడానికి అలా చేస్తున్నాడా? లేదంటే నిజంగానే చేస్తున్నాడా తెలియదు కానీ.. భయంకరంగా ట్రై చేస్తున్నాడు. మార్నింగ్ శ్రీ సత్య.. శ్రీహాన్‌తో డాన్స్ చేస్తుంటే అర్జున్ మాడిపోయిన మసాలా దోసెలా ముఖం పెట్టుకున్నాడు అని చెప్పుకొచ్చింది.
అలాగే బాలాదిత్య మాటి మాటికీ.. దీపు దీపు అంటుంటే నాకు మండుతుంది బిగ్ బాస్ అని చెప్పింది. దీంతో బిగ్ బాస్.. ‘అంతమంటతో నువ్ ఈ చికెన్‌ని తినలేవులే కానీ.. మాట్లాడి మాట్లాడి బాగా అలిసిపోయినట్టు ఉన్నావ్.. ముందు కొంచెం చికెన్ తిను అన్నాడు బిగ్ బాస్. ఆ చికెన్ తిని బయటకు వెళ్ళింది గీతూ.
మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..