Bigg Boss 6 Telugu: రేవంత్ కాన్ఫిడెన్స్.. హౌస్‌లో రొమాన్స్ రెండు ఎక్కువయ్యాయిగా..

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రోజు రోజుకు ఎక్కువవుతోంది. హౌస్ లో లవ్ ట్రాక్ లు.. రొమాన్స్ లతో నానా హంగామా చేస్తున్నారు. ఇక టాస్క్ లలో మాత్రం గొడవలు, ఏడుపులు, అరుపులతో రచ్చ రచ్చ చేస్తున్నారు.

Bigg Boss 6 Telugu: రేవంత్ కాన్ఫిడెన్స్.. హౌస్‌లో రొమాన్స్ రెండు ఎక్కువయ్యాయిగా..
Bigg Boss 6
Follow us

|

Updated on: Sep 29, 2022 | 8:22 AM

బిగ్ బాస్ హౌస్ లో రచ్చ రోజు రోజుకు ఎక్కువవుతోంది. హౌస్ లో లవ్ ట్రాక్ లు.. రొమాన్స్ లతో నానా హంగామా చేస్తున్నారు. ఇక టాస్క్ లలో మాత్రం గొడవలు, ఏడుపులు, అరుపులతో రచ్చ రచ్చ చేస్తున్నారు. ఇక నిన్నటి పిసోడ్ అయితే నెక్స్ట్ లెవల్ అనే చెప్పాలి.బిగ్ బాస్ కప్పు ఎలాగైనా దక్కించుకోవాలని ఎవరి పర్ఫామెన్స్ లు వాళ్ళు చేస్తున్నారు. ఇక హౌస్ లో అర్జున్, శ్రీ సత్య మధ్య ఎం జరుగుతోంది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అర్జున్ శ్రీ సత్య వెనక తిరుగుతున్నా ఆమె మాత్రం పట్టించుకోనట్టుగా బిల్డప్ ఇస్తోంది. ఇక ఇనాయ , సూర్యలు ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ ఇచ్చారు.. సూర్యను ప్రేమించిన అమ్మాయిగా ఇనయా.. తనను మతిమరుపు వ్యక్తిగా సూర్య యాక్ట్ చేశారు. ‘సూర్యా మనం ఇక్కడే కూర్చున్నాం.. ఇక్కడే పడుకున్నాం.. బేబీ నువ్వంటే నాకు చాలా ఇష్టం.. ఇన్ని రోజులు మన మధ్య జరిగినవి అన్నీ మర్చిపోయావా? నిజంగానే నాకు నువ్ అంటే నాకు చాలా ఇష్టం.. నిన్ను వదిలి నేను ఉండలేకపోతున్నా.. నువ్ నన్ను మర్చిపోతే నేను ఎలా బతకాలి’ అని ఇనయా అంటే..

నిజంగా మనం ప్రేమించుకున్నామా? మనషులు అర్ధం చేసుకోవడానికి ఇది మామూలు ప్రేమ కాదు.. అగ్నిలా స్వచ్ఛమైనది అని డైలాగులు కొట్టాడు సూర్య. ఇక హౌస్ లో మిగిలిన వాళ్ళ మధ్య గొడవలు కూడా జరిగాయి. పప్పు విషయంలో రేవంత్, బాలాదిత్య మధ్య చిన్న గొడవ జరిగింది. అలాగే ఫైమా, సుధీప మధ్య కూడా చిన్న పాటి గొడవ జరిగింది. బాత్ రూం దగ్గర కాపలాగా ఉంటాడు రేవంత్. ఆ టైంలో అక్కడికి ఆదిరెడ్డి వచ్చి బాత్ రూంకి వెళ్తా అని అడుగుతాడు. లేదు బ్రో మా వాళ్లు మీటింగ్ పెట్టారు.. వాళ్లు చెప్పినట్టు చేయాలి.. ఇక్కడ నాకు వచ్చేది రూపాయి కూడా లేదు.. ఎవరికి వాళ్లు వాళ్ల ఫేవరేట్ పీపుల్‌ని కాపాడుకుంటున్నారు కాబట్టి.. ఇది ఎలాగూ తేలదు వాళ్లు చెప్పింది చేస్తే.. కనీసం వందో రెండొందలో వస్తుందని అన్నాడు రేవంత్. ఇంతలో అక్కడికి రోహిత్ వస్తాడు రేవంత్ బాత్రూం దగ్గర కాపలాగా ఉండటం చూసి నవ్వుతాడు. దాంతో ఆదిరెడ్డి కూడా నవ్వేశాడు. దానికి ‘నవ్వండి బ్రో.. ఎవరెంత నవ్వుతారో నవ్వండి.. రేపటి రోజున బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్‌ని నేను ఇలా పట్టుకున్నప్పుడు మీ నవ్వులు ఏమౌతాయో చూస్తాను’ అని అన్నాడు రేవంత్ ఇదంతా చూస్తుంటే మనోడు కప్పు కొట్టాలని కసిమీదఉన్నడని అర్ధమవుతోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
మీరు నిద్రలో మాట్లాడుతున్నారా? దానికి కారణం ఇదేనట..!!
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
జక్కన్న హుకుం.! అందుకే ప్రత్యేక శిక్షన తీసుకుంటున్న మహేష్ బాబు..
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
'షూటింగ్‌లో ప్రమాదం, బ్రెయిన్ డ్యామేజ్‌..' హీరోయిన్ ఎమోషనల్.
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 12వేలకే సామ్‌సంగ్‌ 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
యంగ్ హీరోకు విలన్‌గా మంచు మనోజ్‌.! ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్.
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
IPL 2024: ధోనికే ఇచ్చిపడేసిన టీమిండియా ప్లేయర్..
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
‘ఎవరెస్ట్‌ మసాలా’లో పురుగు మందులు.. రీకాల్‌ చేయాలని ఆదేశాలు
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
'ఓ మధ్యతరగతి తండ్రి కథ' ఎమోషనల్‌గా.. సారంగ దరియా టీజర్.
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
బంపర్ ఆఫర్.. ప్రభాస్‌ సలార్ బైక్ మీదే కావచ్చు.! ఎలాగో తోరపడండి..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..
ఈ ముగ్గురిపై సీఎం జగన్ స్పెషల్ ఫోకస్.. ఆ అభ్యర్థులకు బంపర్ ఆఫర్..