AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రచ్చ రచ్చ.. అర్జున్ కళ్యాణ్‌తో గొడవకు దిగిన రేవంత్, శ్రీహాన్..

ఇప్పటికే ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు ఇక హౌస్ లో ఎవరు ఎందుకు గోడవపడుతున్నారో.. ఎందుకు అరుస్తున్నారో అర్ధం కావడం లేదు.

Bigg Boss 6 Telugu: హౌస్‌లో రచ్చ రచ్చ.. అర్జున్ కళ్యాణ్‌తో గొడవకు దిగిన రేవంత్, శ్రీహాన్..
Bigg Boss 6
Rajeev Rayala
|

Updated on: Oct 21, 2022 | 8:00 AM

Share

బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బిగ్ బాస్ లో గొడవలు, అల్లర్లు,  ఏడుపులు రోజు రోజుకు ఎక్కువవుతున్నాయి. ఇప్పటికే ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు ఇక హౌస్ లో ఎవరు ఎందుకు గోడవపడుతున్నారో.. ఎందుకు అరుస్తున్నారో అర్ధం కావడం లేదు. ఇక నిన్నటి ఎపిసోడ్ లో కూడా అలాగే సాగింది. బిగ్ బాస్ సీజన్ 6లో ప్రస్తుతం ఏడో వారం నడుస్తోంది. ఇప్పటికే హౌస్ లో ఉన్న వారు సరిగ్గా ఆడటం లేదు అని బిగ్ బాస్ గడ్డి పెట్టిన విషయం తెలిసిందే. అంతేకాదు, టాలీవుడ్ సెలబ్రిటీ లీగ్ టాస్క్ ని రద్దు చేశాడు. ఈవారం హౌస్ లో కెప్టెన్ కూడా ఎవరూ లేరని తేల్చిచెప్పాడు. ఇక ఈ వారం నామినేషన్స్ నుంచీ సేఫ్ అయ్యేందుకు బాటిల్ ఆఫ్ సర్వైవల్ అనే  టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. దీనికోసం హౌస్ మేట్స్ పోటీపడ్డారు.

ఈ టాస్క్ లో పూలు, బొమ్మలను బెల్ట్ ద్వారా కలక్ట్ చేసి వారికి కేటాయించిన ప్లేస్ లో ఉంచి వాటిని కాపాడుకోవాల్సి ఉంటుంది. ఈ టాస్క్ లో భాగంగా అందరూ హౌస్ మేట్స్ పోటీపడ్డారు. అయితే ఈ టాస్క్ లో గొడవ గట్టిగానే జరిగింది. అర్జున్ కు రేవంత్ కు.. అలాగే అర్జున్ కు శ్రీహాన్ కు మధ్య మాటల యుద్ధం జరిగింది.

ఇక దీపావళి సందర్భంగా బిగ్ బాస్ హౌస్ ఫుల్ గా ముస్తాబవుతోంది. పండగ సందర్భంగా హౌస్ మేట్స్ ను ఉత్సహ పరిచేందుకు పలువురు సెలబ్రెటీలను తీసుకురానున్నారని తెలుస్తోంది. అంతే కాదు శనివారం జరగబోయే ఎపిసోడ్ లో నాగ్ చేతిలో హౌస్ మేట్స్ కు గట్టి క్లాస్ ఉండనుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us