బిగ్ బాస్ హౌస్ లో ఇప్పుడిప్పుడే అసలైన ఆట మొదలవుతోంది. హౌస్ లోకి కొత్త వాళ్ళు రావడంతో కాంపిటేషన్ టైట్ అయ్యింది . నిన్న సోమవారం కావడంతో నామినేషన్స్ మొదలయ్యాయి. మామూలుగానే నామినేషన్స్ ఓ రేంజ్ లో జరుగుతాయి. నిన్న కూడా అదే జరిగింది. కొత్తగా వచ్చిన హౌస్ మేట్స్ ఆల్రెడీ హౌస్ లో ఉన్నవారిని నామినేట్ చేయాల్సి ఉంటుంది. దాంతో అసలైన యుద్ధం మొదలైంది. హౌస్ లో ఉన్నవారిని రెండు టీమ్స్ గా డివైడ్ చేశారు బిగ్ బాస్. పాతవాళ్లను ఆటగాళ్లుగా కొత్తవాళ్లను పోటుగాళ్లుగా డివైడ్ చేశాడు బిగ్ బాస్. దాంతో పోటుగాళ్లు ఆటగాళ్లను నామినేట్ చేశారు. హౌస్‌లో ఉండేందుకు అనర్హులో కారణాలు చెప్పి ఇద్దరినీ నామినేట్ చేయమన్నాడు బిగ్ బాస్. అశ్విని ముందుగా అమర్ దీప్ ను నామినేట్ చేసింది. అతను సెల్ఫిష్ గా ఉంటున్నాడని. అది తనకు నచ్చలేదు అని చెప్పింది. దాంతో అమర్ అశ్వినికి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇక్కడ సెల్ఫిష్ గానే ఉండాలి. నా ఆట నా కోసమే ఆడాలి అని ఎదో చెప్పడానికి ట్రై చేశాడు.
ఆతర్వాత అశ్విని శోబాశెట్టి ని నామినేట్ చేసింది. ఆమె ను నామినేట్ చేస్తూ .. గ్రూప్ గా గేమ్ ఆడుతున్నారని.. గ్రూపిజం చూపిస్తున్నారని అంది దాంతో రచ్చ మొదలైంది. నాతో ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడలేదు అంటూ అశ్విని చెప్పింది. గ్రూప్ గా ఎవరు తిరుగుతున్నారు.? ఎవరితో గ్రూప్ గా తిరుగుతున్నా..? చెప్పండి అంటూ కాస్త గట్టిగానే అడిగింది శోభ. దాంతో అశ్విని బిత్తరపోయింది.
నేను ఒక్కరినే నామినేట్ చేయాలని అనుకున్నా.. కానీ ఇద్దరినీ నామినేట్ చేయాలన్నారు అందుకే మిమ్మల్ని నామినేట్ చేస్తున్న అని అనేసింది. దాంతో శోభా శెట్టి మరింత రెచ్చిపోయింది. అలా ఎలా చేస్తారు.? అనే ఎదో నామినేట్ చేయాలి కాబట్టి రీజన్ లేకుండా నామినేట్ చేస్తారా.? దాంతో అశ్వినికి ఎంచెప్పాలో తెలియక ప్రియాంకను కూడా మేనిపులేట్ చేస్తున్నారు అని మరేదో చెప్పింది. దాంతో శోభకు మరింత కాలింది. దాంతో అశ్విని పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. ఆతర్వాత శోభాకు ఛాన్స్ వచ్చింది. దాంతో అశ్వినిని నామినేట్ చేసింది. ఆమె తనకు చెప్పిన రీజన్ నచ్చలేదు అని. సిల్లీగా అనిపించిందని తెలిపింది. దాంతో అశ్విని ఏడుపు మొదలు పెట్టింది. శోభ దెబ్బకు గుక్కపట్టి ఏడ్చింది అశ్విని. ప్లీజ్ నామినేట్ చేసెయ్, ప్లీజ్ ఎలిమినేట్ చేసేయండి.. నేను ఇంటికెళ్లిపోవాలి.. అంటూ వెక్కి వెక్కి ఏడ్చింది అశ్విని.
మరిన్ని బిగ్ బాస్ ఆర్టికల్స్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..